- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
బీజేపీకి మరో బిగ్ షాక్.. కీలక మహిళా నేత రాజీనామా
దిశ, వెబ్‌డెస్క్: ఎన్నికల వేళ వేములవాడ నియోజకవర్గంలో బీజేపీకి మరో షాక్ తగిలింది. కీలక మహిళా నాయకురాలు తుల ఉమ రాజీనామా చేశారు. ఈ మేరకు సోమవారం ఆమె రాజీనామా లేఖను ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్ రెడ్డికి పంపించారు. అంతేకాదు.. ఇవాళ తెలంగాణ భవన్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్‌లో చేరనున్నట్లు సమాచారం. ఇప్పటికే స్థానిక బీఆర్ఎస్ నేతలతో ఉమ సమావేశమై నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కాగా, తుల ఉమ బీజేపీ నుంచి వేములవాడ టికెట్ ఆశించారు. అయితే, అనూహ్యంగా వేములవాడ అభ్యర్థి విషయంలో బీజేపీ అధిష్టానం యూటర్న్ తీసుకుని తులా ఉమకు బదులు వికాస్ రావుకు బీఫాం ఇచ్చింది.
ఇందుకు కారణం.. స్థానిక నాయకత్వం అంతా కూడా మూడు రోజులుగా బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో నిరసనలు తెలపడం. గతంలో జనశక్తి పార్టీలో పనిచేసిన తుల ఉమ బీజేపీ నేతలను టార్గెట్ చేసిన అంశాన్ని వేములవాడ బీజేపీ శ్రేణులు అధిష్టానం ముందు పెట్టారు. మేడిపల్లి మండలానికి చెందిన పార్టీ అధ్యక్షుడు గోరె బాబు మియాతో పాటు ఇద్దరు సర్పంచులను జనశక్తి హత్య చేయడంతో పాటు, రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షుడిగా ప్రస్తుతం కొనసాగుతున్న ప్రతాప రామకృష్ణపై కూడా దాడి చేసిన విషయాన్ని రాష్ట్ర నాయకత్వానికి వివరించినట్టుగా సమాచారం. దీంతో బీజేపీ రాష్ట్ర నాయకత్వం పునరాలోచనలో పడిపోయి వికాస్ రావు అభ్యర్థిత్వానికే మొగ్గు చూపింది.