- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
HYD: నగరంలో పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు
దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణలో ఎన్నికల ప్రచారం ఫైనల్ స్టేజ్ కు చేరుకుంది. సోమవారం ప్రధాని నరేంద్ర మోడీ హైదరాబాద్ లో భారీ ఎత్తున రోడ్ షో నిర్వహిస్తున్నారు. సాయంత్రం 4 గంటలకు ఆర్టీసీ క్రాస్ రోడ్డు నుంచి మొదలై కాచిగూడ వీర సావర్కర్ విగ్రహం వరకు దాదాపు రెండున్నర కిలోమీటర్ల వరకు రోడ్ షో నిర్వహించనున్నారు. ఈ రోడ్ షో సందర్భంగా మధ్యాహ్నం 1 గంట నుంచి రాత్రి 10 గంటల వరకు నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు విధించినట్లు హైదరాబాద్ ట్రాఫిక్ అడిషనల్ కమిషనల్ వాహనదారులను అప్రమత్తం చేశారు.
బేగంపేట విమానాశ్రయం నుండి కాచిగూడ ఎక్స్ రోడ్స్ మీదుగా ఎయిర్‌పోర్ట్ వై జంక్షన్, పీఎన్ టీ ఫ్లై ఓవర్ కింద కుడి మలుపు, షాపర్స్ స్టాప్, హైదరాబాద్ పబ్లిక్ స్కూల్, బేగంపేట్ ఫ్లై ఓవర్, గ్రీన్ ల్యాండ్స్, అమీర్‌పేట్, పంజాగుట్ట, రాజీవ్ గాంధీ విగ్రహం/మోనప్ప ఐలాండ్ జంక్షన్, యశోద హాస్పిటల్, ఎంఎంటీఎస్, రాజ్ భవన్, వివి స్టాచ్యు, నిరంకారి, పాత పీఎస్ సైఫాబాద్, ఇక్బాల్ మినార్, ఖైరతాబాద్ ఫ్లైఓవర్, ఇందిరా రోటరీ (నెక్లెస్ రోటరీ), ఎన్టీఆర్ మార్గ్, తెలుగు తల్లి, కట్ట మైసమ్మ, ఇందిరాపార్క్, అశోక్‌నగర్, ఆర్టీసీ ఎక్స్ రోడ్లు, చిక్కడపల్లి, నారాయణగూడ మరియు కాచిగూడ ఎక్స్ రోడ్ మార్గాలలో ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయని వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని సూచించారు.