- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కేటీఆర్.. తెలంగాణకు కాంగ్రెస్ చేసింది ఇదే!
దిశ, డైనమిక్ బ్యూరో: కాంగ్రెస్ పార్టీ తెలంగాణకు ఏం చేసిందని మంత్రి కేటీఆర్ ప్రశ్నిస్తున్నారని నాగార్జున సాగర్, శ్రీశైలం, శ్రీరామ్ సాగర్, నెట్టెంపాడు వంటి భారీ ప్రాజెక్టులు, హైదరాబాద్కు ఐటీ ప్రాజెక్టులు, విమానాశ్రయం, మెట్రో రైలు మంజూరు చేసింది ఎవరు? అని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. దేశం కోసం గాంధీ కుటుంబం త్యాగం చేస్తే నీళ్లు, నిధులు, నియామకాల పేరు చెప్పి కేసీఆర్ ప్రజలను మోసం చేశారని దుయ్యబట్టారు.
అవకాశం వచ్చినా సోనియా, రాహుల్ గాంధీలు ప్రధాని పదవులు చేపట్టలేదని గుర్తుచేశారు. ఇన్నేళ్లు ఎంపీ పదవుల్లో ఉన్నప్పటికీ రాహుల్ గాంధీకి సొంత ఇల్లు లేదని కానీ కేసీఆర్ కుటుంబానికి ఇన్ని ఆస్తులు ఎక్కడి నుండి వచ్చాయని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇవ్వకుంటే కేసీఆర్ కుటుంబం ఎక్కడ ఉండేదని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఆరు గ్యారెంటీ స్కీమ్లను అమలు చేసి చూపిస్తామన్నారు.