- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
LB స్టేడియంలో BC ఆత్మగౌరవ సభ.. చీఫ్ గెస్ట్‌గా ప్రధాని మోడీ
దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో ప్రధాని మోడీ షెడ్యూల్ ఖరారైంది. ఈనెల 7వ తేదీన ఆయన హైదరాబాద్‌కు రానున్నారు. ఎల్బీ స్టేడియంలో నిర్వహిస్తున్న బీసీ ఆత్మగౌరవ మహాసభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. బీసీ సీఎం నినాదంతో ఈ సభకు ప్రాధాన్యత ఏర్పడింది. ప్రధాని మోడీ బీసీలకు భరోసానిచ్చేలా హామీలుంటాయని పార్టీ శ్రేణులు ధీమా వ్యక్తంచేస్తున్నాయి. కాగా, ఈ సభను సక్సెస్ చేయడంపై బీజేపీ రాష్ట్ర నాయకత్వం ప్రణిళిక సిద్ధం చేసుకుంది. లక్ష మందితో సభ నిర్వహించాలని చూస్తోంది. గ్రేటర్ పరిధిలోని అన్ని ప్రాంతాల నుంచి జనాన్ని తరలించాలని చూస్తోంది. ఈమేరకు కిషన్ రెడ్డి నేతలకు దిశానిర్దేశం కూడా చేశారు. 7వ తేదీన బీసీ ఆత్మగౌరవ సభకు హాజరవుతున్న మోడీ 11వ తేదీన పరేడ్ గ్రౌండ్ లో నిర్వహించే మాదిగ, ఉపకులాల విశ్వరూప మహాసభకు ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు.
ప్రధాని మోడీ షెడ్యూల్
ప్రధాని మోడీ ఈనెల 7వ తేదీన సాయంత్రం 5 గంటల 5 నిమిషాలకు బేగంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గం ద్వారా సాయంత్రం 5:25 గంటలకు ఎల్బీ స్టేడియం వద్దకు చేరుకుంటారు. సాయంత్రం 5:30 గంటల నుంచి 6:15 వరకు బహిరంగ సభలో పాల్గొంటారు. సభ అనంతరం 6:30 గంటలకు బేగంపేట నుంచి తిరిగి ఢిల్లీకి పయనం కానున్నారు.