- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
అధికారుల బదిలీ.. బీఆర్‌ఎస్ ప్రభుత్వానికి చెంప దెబ్బ
by GSrikanth |
X
దిశ, డైనమిక్ బ్యూరో: ఎమ్మెల్సీ తాత మధు నిన్న బీఆర్ఎస్ దొరల అసలు రూపాన్ని బయట పెట్టారని బీఎస్పీ స్టేట్ చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. కేసీఆర్ ప్రభుత్వం ఇలా అడుగడుగునా అధికార దుర్వినియోగానికి పాల్పడి ప్రజలను వంచిస్తోందని, అందుకే ఇది గమనించి నిన్ననే కేంద్ర ఎలక్షన్ కమిషన్ గతంలో ఎక్కడ, ఎన్నడూ లేని విధంగా 19 మంది ఉన్నతాధికారులను ట్రాన్స్ఫర్ చేసిందని వెల్లడించారు. ఇది ఆయా అధికారులకే కాక బీఆర్ఎస్ ప్రభుత్వానికి చెంప దెబ్బ లాంటిదన్నారు.
అధికారం తమ గడీలో బానిసగా పడి ఉండాలని ఈ దొరల ప్రభుత్వం అనుకుంటుందన్నారు. అధికారం పేద ప్రజల జీవితాన్ని మార్చే ఆయుధం కావాలనుకుంటున్నది బహుజన సమాజ్ పార్టీ. అందుకే ఈ ఎన్నికల్లో దొరల రాజ్యాన్ని కూలగొట్టి బహుజన రాజ్యాన్ని ఏర్పాటు చేసుకుందామని పిలుపునిచ్చారు.
Advertisement
Next Story