- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వాళ్లకే టికెట్లు.. ఇందులో ఎలాంటి మార్పు ఉండదు: రేవంత్ రెడ్డి
దిశ, తెలంగాణ బ్యూరో: సెంట్రల్ ఎలక్షన్ కమిటీ ఫైనల్ చేసిన అభ్యర్థులకే బీ ఫామ్‌లు అందుతాయని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. శనివారం ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ.. అన్ని అసెంబ్లీ సెగ్మెంట్‌లలోని పరిస్థితులు, కులాల వారీగా ప్రాధాన్యత, మహిళలకు అవకాశాలు, సర్వే రిపోర్టులను పరిగణలోకి తీసుకొని టిక్కెట్లను నిర్ణయిస్తామన్నారు. సీఈసీ అన్నింటినీ క్రోడీకరించి అభ్యర్థులను ఎంపిక చేయనున్నదని తెలిపారు. అందుకే టిక్కెట్ల పంపిణీ ఆలస్యమవుతుందన్నారు. త్వరలోనే ఫేజ్-1లోని అభ్యర్థులను ప్రకటిస్తామన్నారు. అప్పటి వరకు సోషల్ మీడియాల్లో వచ్చే వార్తలను నమ్మొద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. గెలిచే అభ్యర్థులకే టిక్కెట్లు కేటాయించాలని హైకమాండ్ కంకణం కట్టుకొని ఉన్నదన్నారు.
టిక్కెట్లు రాకపోయినా.. ప్రభుత్వం వచ్చాక నామినేటెడ్ పదవులు కల్పిస్తామన్నారు. దాదాపు వెయ్యి మందికి పైగా నామినేటెడ్ విధానంలో పదవులు ఇవ్వొచ్చని పేర్కొన్నారు. కేసీఆర్ అన్యాయాలపై ప్రజలు తిరగబడుతున్నారని, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు కానున్నదని ధీమా వ్యక్తం చేశారు. ఇక పార్టీని అధికారంలోకి తీసుకొచ్చేందుకు రాష్ట్రంలోని కీలక నేతలంతా త్వరలోనే బస్సు యాత్రను చేపడుతున్నట్లు రేవంత్ వెల్లడించారు. ఇందుకు తగిన కార్యచరణను రూపొందిస్తున్నట్లు వెల్లడించారు. సోనియా గాంధీ ప్రకటించిన ఆరు గ్యారంటీలను ఇంటింటికి చేరవేస్తామన్నారు.