- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీ సంచలన నిర్ణయం
దిశ, డైనమిక్ బ్యూరో: కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే గణనతో పాటు మహిళా రిజర్వేషన్‌లో ఓబీసీ కోటా అమలు పరుస్తామని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు. ఈ మేరకు ఇవాళ ఢిల్లీలో జరిగిన సీడబ్ల్యూసీ మీటింగ్‌లో కులగణనపై ఏకగ్రీవం ఆమోదంతో నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. ఇది చారిత్రాత్మక నిర్ణయం అన్నారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలైన కర్నాటక, రాజస్థాన్, హిమాచల్ ప్రదేశ్, ఛత్తీస్ గఢ్ సీఎంల నుంచి కూడా కులగణనకు మద్దతు ఉందని చెప్పారు.
కులగణనను దేశం మొత్తం కొరుకుంటోందని ప్రధాని నరేంద్ర మోడీ మాత్రం కులగణన చేపట్టడం లేదని ధ్వజమెత్తారు. కులగణన అనేది కులం, మతానికి సంబంధించిన విషయం కాదని పేదరికానికి సంబంధించిన విషయం అన్నారు. కులగణన లేకుండా సంక్షేమ పథకాల అమలు చేయడం అంటే ఎక్స్ రే తీయకుండా రోగికి వైద్యం చేయడం లాంటిదని సెటైర్ వేశారు. కాగా త్వరలో జరగబోయే ఐదు రాష్ట్రాల ఎన్నికలు, 2024 సార్వత్రిక ఎన్నికల్లో పార్టీని విజయం వైపు నడిపించడంలో కులగణనను ప్రధాన అస్త్రంగా చేసుకోవాలని కాంగ్రెస్ భావిస్తున్నట్లు తెలుస్తోంది.