రేవంత్ రెడ్డితో ఏపీ కీలక నేత భేటీ

by GSrikanth |
రేవంత్ రెడ్డితో ఏపీ కీలక నేత భేటీ
X

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డితో ఆంధ్రప్రదేశ్ పరిరక్షణ సమితి అధ్యక్షుడు కొలికపూడి శ్రీనివాస్ రావు భేటీ అయ్యారు. శుక్రవారం హైదరాబాద్‌లోని రేవంత్ నివాసంలో కలిశారు. ఈ సందర్భంగా తాజా రాజకీయాలపై వారు సుదీర్ఘంగా చర్చించారు. రాబోయే శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి కొలికపూడి శ్రీనివాసరావు మద్దతు ప్రకటించినట్లు తెలుస్తోంది. 24 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ అభ్యర్థుల తరపున ప్రచారం చేయబోతున్నట్లు కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. కొలికపూడి శ్రీనివాస్‌తో పాటు, ఆంధ్రప్రదేశ్ పరిరక్షణ సమితిలోని మరికొందరు నేతలు కూడా కాంగ్రెస్ ఎన్నికల ప్రచారానికి హాజరు కానున్నట్లు సమాచారం.

Advertisement

Next Story