ఇక కాసుకో కేసీఆర్.. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి షాకింగ్ కామెంట్స్

by GSrikanth |
ఇక కాసుకో కేసీఆర్.. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి షాకింగ్ కామెంట్స్
X

దిశ, వెబ్‌డెస్క్: బీఆర్ఎస్ మేనిఫెస్టోపై బీజేపీ కీలక నేత, మునుగోడు మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు ఆయన సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు. ‘‘విద్య, ఉద్యోగాలే అజెండాగా తెచ్చుకున్న తెలంగాణలో రెండుసార్లు అధికారంలోకి వచ్చి విద్యార్థులను ఉద్ధరించిందేమీ లేదు. రాబోయే ఎన్నికల మ్యానిఫెస్టోలో విద్యారంగానికి ఏ మాత్రం ప్రాధాన్యం ఇవ్వకపోవడం దారుణం. విద్యార్థులు, యువత మిమ్మల్ని ఓడగొట్టేందుకు సిద్ధంగా ఉన్నారు కాసుకో కేసీఆర్. అన్నం పెట్టే రైతన్నలకు ఇవ్వాల్సిన రైతుబంధు పథకాన్ని వందల ఎకరాల భూస్వాములకు కట్టబెట్టే కుట్రలు చాలించు కేసీఆర్. ఇప్పటికీ కౌలు రైతుల కష్టాలు, కన్నీళ్లు నీకు కనిపించట్లేదా? నీ నయవంచక పాలనకి, బూటకపు హామీలకు అన్నదాతలే చెక్ పెడతారు.’’ అంటూ ఘాటుగా ట్విట్టర్ వేదికగా బీఆర్ఎస్ సర్కార్‌పై రాజగోపాల్ రెడ్డి విమర్శలు చేశారు.


Advertisement

Next Story

Most Viewed