- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
తెలంగాణ ఎన్నికల్లో భారీగా పట్టుబడుతున్న నగదు.. కేవలం 10 రోజుల్లోనే ఎంతంటే..?
దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ ఎన్నికల వేళ భారీగా నగదు పట్టుబడుతోంది. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన నేపథ్యంలో రూ.లక్షలు, రూ.కోట్ల నగదును వ్యక్తుల నుంచి పోలీసులు స్వాధీనం చేసుకుంటున్నారు. ఈ నెల 9వ తేదీన ఐదు రాష్ట్రాల ఎన్నికలకు ఈసీ షెడ్యూల్ విడుదల చేయడంతో.. ఆ రోజు నుంచి ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. ఆ రోజు నుంచి తెలంగాణ పోలీసులు అన్ని ప్రాంతాల్లో ఎక్కడిక్కడ చెక్ పోస్ట్‌లు ఏర్పాటు చేసి తనిఖీలు చేస్తోన్నారు. ఎలాంటి పత్రాలు, ఆధారం లేకుండా తరలిస్తున్న సొమ్మును స్వాధీనం చేసుకుంటున్నారు.
ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చి 10 రోజులు అవుతుండగా.. ఇప్పటివరకు రూ.200 కోట్లకుపైగా నగదును పట్టుకున్నారు. డబ్బు, మద్యం, బంగారం కలిపి మొత్తం రూ.243.76 కోట్ల విలువ చేసే సొమ్మును స్వాధీనం చేసుకున్నారు. రూ.120.40 కోట్ల విలువ చేసే బంగారం, వెండి వస్తువులు తనిఖీల్లో పట్టుకున్నారు. బుధవారం ఒక్కరోజే రూ.78.03 కోట్లు పట్టుబడ్డాయి. 2018 ఎన్నికల్లో మొత్తం రూ.137 కోట్ల విలువ చేసే సొమ్ము పట్టుబడగా.. ఇప్పుడు ఏకంగా 10 రోజుల్లోనే అంతకంటే ఎక్కువ స్వాధీనం చేసుకున్నారు . గడిచిన 10 రోజుల్లో రూ.87 కోట్ల 92 లక్షల నగదు, రూ.10 కోట్ల 21 లక్షల విలువ చేసే మద్యం, రూ.120 కోట్ల విలువ చేసే బంగారం, వెండి, వజ్రాలు పట్టుబడ్డాయి. అటు ఇవాళ హైదరాబాద్‌లోని చైతన్యపురిలో ఓ వ్యక్తి దగ్గర నుంచి పత్రాలు లేని రూ.97 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు.