- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
పత్తి కొనుగోళ్లలో ప్రహసనం.. రైతు కష్టమంతా కమీషన్ ఏజెంట్లకు
దిశ ప్రతినిధి, నిర్మల్: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఇంకా అనేక చోట్ల పత్తి కొనుగోలు కేంద్రాలు ప్రారంభించకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పండిన పత్తి పంటను ఇంట్లో దాచుకోలేక మార్కెట్‌కు వెళ్లి అమ్ముకోలేక రైతులు కాటన్ కమీషన్ ఏజెంట్ల బారిన పడుతున్నారు. ఇదే అనువుగా కమీషన్ ఏజెంట్లు రైతుల వద్ద క్వింటాలు పత్తి రూ.200, రూ.500 తక్కువ ధరతో కొనుగోలు చేసి అమ్ముకుంటున్నారు. దీంతో పత్తి రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు.
సీసీఐకి అమ్ముకోలేక..
పత్తి రైతులు తాము పండించిన పత్తి పంటను సీసీఐకి అమ్ముకోలేని పరిస్థితిలు నెలకొన్నాయి. ప్రైవేటు వ్యాపారులతో పోలిస్తే రూ.400 వ్యత్యాసంతో సీసీఐ కొనుగోలు చేస్తున్నప్పటికీ రైతులు అక్కడ పంట అమ్ముకునేందుకు ఆసక్తి చూపడం లేదు. సీసీఐ క్వింటాలు పత్తి ధర రూ.7,521 ప్రకటించింది. ప్రైవేటు వ్యాపారులు క్వింటాలు పత్తి రూ.7,120తో కొనుగోలు చేస్తున్నారు. సీసీఐకి అమ్మితే రైతులకు డబ్బులు ఆలస్యంగా వస్తాయన్న కారణంతో రైతులు ప్రైవేటు వైపు మొగ్గు చూపుతున్నారు. అయితే ప్రైవేటు వ్యాపారులు ధర తక్కువ పెట్టడమే గత ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఇంకా అన్ని చోట్ల కొనుగోలు ప్రారంభించ లేదు. దీంతో రైతులు కమిషన్ ఏజెంట్లను ఆశ్రయిస్తున్నారు.
రూ.200 నుంచి రూ.500 తక్కువకు..
కమిషన్ ఏజెంట్లు రైతుల వద్ద క్వింటాలు పత్తి ధర రూ.200 నుంచి రూ.500 తక్కువ ఇచ్చి కొనుగోలు చేస్తున్న పరిస్థితులు ఉన్నాయి. ఇప్పటికే ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో ప్రతి రైతుల ఇళ్లకు చేరింది. అయితే జిల్లాలోని బైంసా, నిర్మల్, బోథ్, సోనాల, ఇచ్చోడ, ఇంద్రవెల్లి, ఆసిఫాబాద్, జైనూరు, సహా తూర్పు జిల్లాలోనూ పలుచోట్ల ఇప్పటికీ కొనుగోలు కేంద్రాలు ప్రారంభించ లేదు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో మాత్రమే పత్తి కొనుగోలు ప్రారంభమయ్యాయి. దీంతో వివిధ ప్రాంతాల్లో పత్తి పండించిన రైతులు ఆదిలాబాద్ తరలించడం విషయంలో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
దూర భారం కావడంతో రైతులు కమిషన్ ఏజెంట్లను ఆశ్రయిస్తున్నారు. దీంతో కమిషన్ ఏజెంట్లు రైతుల వద్ద క్వింటాలు పత్తి రూ.6,800 నుంచి రూ.7 వేల దాకా కొనుగోలు చేస్తున్నారు. వారు వెంటనే డబ్బు చెల్లిస్తూ ఉండడంతో రైతులు కూడా కమిషన్ ఏజెంట్లకు అమ్మేందుకు ఆసక్తి చూపుతున్నారు. రైతుల నుంచి కొనుగోలు చేసిన పత్తిని ఆదిలాబాద్ సీసీఐకి తరలించి కమిషన్ ఏజెంట్లు భారీగా లాభాలు ఆర్జిస్తున్నారు. ప్రధానంగా బైంసా ప్రాంతం నుంచి పెద్ద మొత్తంలో కమిషన్ ఏజెంట్లు పత్తి కొనుగోలు చేసే ఆదిలాబాద్ కరీంనగర్ సీసీఐకి తరలిస్తున్న పరిస్థితులు నెలకొన్నాయి.