Sadar Sammelanam: నేడే సదర్ సమ్మేళనం..నగరానికి చేరుకున్న దున్నలు

by Y. Venkata Narasimha Reddy |
Sadar Sammelanam: నేడే సదర్ సమ్మేళనం..నగరానికి చేరుకున్న దున్నలు
X

దిశ, వెబ్ డెస్క్ : ఏటా హైదరాబాద్ (Hyderabad)లో యాదవులు ప్రతిష్టాత్మకంగా నిర్వహించే సదర్ సమ్మేళనానికి(Sadar Sammelanam) రంగం సిద్ధమైంది. నేడు శనివారం నిర్వహించే సదర్ సమ్మేళనంలో పాల్గొనేందుకు దేశంలోని పలు ప్రాంతాల నుంచి పేరొందిన దున్నపోతులు నగరానికి చేరుకున్నాయి. హర్యానాకు చెందిన ఏడడుగులకు పైగా ఎత్తు, 14 అడుగుల పొడవు, 3 వేల కిలోల బరువుతో ఉండే 'గోలు 2' దున్నపోతు అందరి దృష్టిని ఆకర్షించేందుకు సిద్ధమైంది. శ్రీకృష్ణ, షైరా, బాదో, విదాయక్ వంటి దున్నలతో పాటు తెలుగు రాష్ట్రాల్లోని బలమైన దున్నరాజులు కూడా సదర్ లో తమ దర్జాను, విన్యాసాలను చూపనున్నాయి. హర్యానా శ్రీకృష్ణ అనే దున్నపోతు 1,800 కిలోల బరువు, 7 అడుగుల ఎత్తు, ముక్కు నుంచి తోక వరకు 18 అడుగుల పొడవు ఉంది. ఇది జాతీయ పశుప్రదర్శనల్లో పాతిక సార్లు చాంపియన్‌గా నిలిచింది. అలాగే పంజాబ్ నుంచి తెప్పించిన కింగ్, ఇంకా భీమ్ దున్న రాజులు, లోకల్ దున్న బాహుబలి ప్రత్యేక ఆకర్షణగా నిలువనున్నాయి.

ఈ ధఫా సదర్ సమ్మేళన్‌లో ఛాంపియన్ ఎద్దులను చేర్చారు. శనివారం రాత్రి 7గంటల నుంచి తెల్లవారుజామున 3గంటలకు సదర్ ఉత్సవాలు కొనసాగనున్నయి. దున్నపోతుల విన్యాసాలకు యాదవ సోదరులు అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు. బలమైన దున్నరాజులను తీసుకొస్తున్నారు. సదర్ సమ్మేళనం నేపథ్యంలో నారాయణ గూడ వైఎంసీఏ కూడలిలో ట్రాఫిక్ ఆంక్షలు అమలులోకి రానున్నాయి.

Advertisement

Next Story

Most Viewed