- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
AP News:ఉచిత గ్యాస్ సిలిండర్ పథకం.. సీఎం చంద్రబాబు మరో గుడ్ న్యూస్
దిశ,వెబ్‌డెస్క్: ఏపీలో ఎన్డీయే కూటమి ప్రభుత్వం(AP Government) ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తోంది. ఇక ఎన్డీయే కూటమి రాష్ట్రాభివృద్ధి(State Development) లక్ష్యంగా ముందుకు అడుగులు వేస్తోంది. ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబు(CM Chandrababu) నిన్న(శుక్రవారం) శ్రీకాకుళం జిల్లాలోని ఈదుపురంలో ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకాన్ని(Free gas cylinders scheme) ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు ఉచిత గ్యాస్ లబ్ధిదారులకు మరో శుభవార్త చెప్పారు. మహిళలు తొలుత డబ్బు చెల్లించాల్సిన అవసరం లేకుండానే సిలిండర్ అందించేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ‘ప్రస్తుతం లబ్ధిదారులు డబ్బులు చెల్లిస్తే 2 రోజుల్లో ప్రభుత్వం తిరిగి చెల్లిస్తోంది. నేరుగా ఫ్రీ సిలిండర్ ఇచ్చేందుకు సాంకేతిక సమస్యలు వస్తున్నాయి. త్వరలోనే వాటిని పరిష్కరిస్తాం’ అని సీఎం చంద్రబాబు తెలిపారు.