3rd Test: హాఫ్ సెంచరీలు చేసిన శుభ్‌మన్ గిల్, రిషబ్ పంత్

by Gantepaka Srikanth |
3rd Test: హాఫ్ సెంచరీలు చేసిన శుభ్‌మన్ గిల్, రిషబ్ పంత్
X

దిశ, వెబ్‌డెస్క్: ముంబైలోని వాంఖడే మైదానం(Wankhede Ground) వేదికగా జరుగుతోన్న మూడో టెస్టు(3rd Test)లో టీమిండియా బ్యాటర్లు నిలకడగా రాణిస్తున్నారు. క్లిష్ట సమయంలో ఆదుకున్న రిషబ్ పంత్(Rishabh Pant), శుభ్‌మన్ ‌గిల్(Shubman Gill) ఇద్దరూ హాఫ్ సంచరీలు చేశారు. తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్(New Zealand) జట్టు 235 పరుగులకు ఆలౌటైంది. శుక్రవారం తొలి రోజు భారత్‌ 4 వికెట్లు కోల్పోయి 86 పరుగులు చేసింది. యశస్వి జైస్వాల్ 30, రోహిత్ శర్మ 18, విరాట్ కోహ్లీ 4, మహ్మద్ సిరాజ్ జోరోకే ఔటయ్యారు. అజాజ్ పటేల్ 2 వికెట్లు, మాట్ హెన్రీ 1 వికెట్ తీశారు. కోహ్లీ రనౌట్ కావడం గమనార్హం. ప్రస్తుతం శుభ్‌మన్ గిల్(58), రిషబ్ పంత్(50) రాణిస్తున్నారు. టీమిండియా ఇంకా 72 పరుగులు వెనుకబడి ఉంది.

Advertisement

Next Story