Minister Ponnam: కులగణనతో బీసీల్లో పెను మార్పులు రాబోతున్నాయ్.. మంత్రి పొన్నం కీలక వ్యాఖ్యలు

by Shiva |   ( Updated:2024-11-02 05:27:13.0  )
Minister Ponnam: కులగణనతో బీసీల్లో పెను మార్పులు రాబోతున్నాయ్.. మంత్రి పొన్నం కీలక వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: కులగణన (Cast Census)పై రాష్ట్రంలో విపక్షాలు అనవసరంగా రాద్ధాంతం చేస్తున్నాయని మంత్రి పొన్నం ప్రభాకర్ (Minister Ponnam Prabhakar) కీలక వ్యాఖ్యలు చేశారు. ఇవాళ ఆయన కరీంనగర్‌ (Karimnagar)లో మీడియాతో మాట్లాడుతూ.. కులగణన (Cast Census)తో బీసీ(BC)ల్లో పెను మార్పులు రాబోతున్నాయని తెలిపారు. స్థానిక సంస్థలు, ఇతర రంగాల రిజర్వేషన్లపై కూడా తాము ఆలోచన చేస్తున్నామని పేర్కొన్నారు. డిసెంబర్‌లో కులగణన (Cast Census) నివేదికను ప్రజలకు మందుకు తీసుకొస్తామని స్పష్టం చేశారు.

సర్వే విషయంలో ఎవరికీ ఎలాంటి అనుమానాలు, అయోమయం అక్కర్లేదని అన్నారు. అందరూ సర్వేకు సహకరించాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో కులగణనపై ప్రతిపక్షాలు (Opposition Parties) అనవసర రాద్ధాంతం చేస్తున్నాయని ఆయన మండిపడ్డారు. బీసీ కమిషన్ ఏర్పాటును హైకోర్టు తప్పుబట్టలేదని.. డెడికేషన్ కమిటీ వేయాలని చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్న నాడు సకల జనుల సర్వేను చెపట్టి కనీసం రిపోర్టును కూడా బయటపెట్టలేదని ఎద్దేవా చేశారు. రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానం హైకోర్టు (High Court) ఉత్తర్వుల మేరకు రాష్ట్రంలో కులగణన జరుగుతోందని స్పష్టం చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు కులగణన ప్రక్రియను ప్రారంభించబోతున్నామని మంత్రి పొన్నం తెలిపారు.

Advertisement

Next Story