- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
రాజకీయాల్లో నన్ను పావుగా వాడుకుంటున్నారు: పూనమ్ కౌర్
దిశ, డైనమిక్ బ్యూరో: తాను ఇప్పటివరకు ఏ రాజకీయ పార్టీ కండువా కప్పుకోలేదని ప్రముఖ నటి, సామాజిక కార్యకర్త పూనమ్ కౌర్ క్లారిటీ ఇచ్చారు. ఏ రాజకీయ పార్టీకి సంబంధించిన వ్యక్తిని కాదని ఇవాళ ఒక ప్రకటన విడుదల చేశారు. సమస్య ఆధారంగానే తాను స్పందిస్తుంటానని వెల్లడించారు. ఈ మధ్య కొందరు రాజకీయ నాయకులు వారి ప్రయోజనాల కోసం తనను ఓ పావుగా వాడాలనుకుంటున్నారని ఆరోపించారు. ఇది సముచితం కాదని, గత ఎన్నికల్లో కూడా ఇలాంటి వికృత చేష్టలు చేశారని గుర్తుచేశారు. మరికొందరు పైశాచిక ఆనందం పొందాలనుకుంటున్నారని తెలిపారు. ఒక మహిళపై ఇలాంటి కుట్రలు తగదన్నారు. మరికొందరు నాయకులు సానుభూతి పేరుతో తనకు, తన కుటుంబ సభ్యులకు ఫోన్లు చేస్తున్నారని తెలిపారు. ‘నేను సిక్కుబిడ్డను, మాకు త్యాగాలు తెలుసు. పోరాటాలు తెలుసు’ అని పేర్కొన్నారు.
దయచేసి రాజకీయాల కోసం తనను లాగొద్దని వేడుకున్నారు. ప్రస్తుతం తాను చేనేత కళాకారుల కోసం పనిచేస్తున్నారని తెలిపారు. గత రెండు ఏళ్లుగా వారి కోసం జాతీయ చేనేత దినోత్సవ రూపకర్త యర్రమాద వెంకన్న నేతతో కలిసి దేశవ్యాప్త పర్యటన చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఇప్పటికే 15 రాష్ట్రాలు, 21 రాజకీయ పార్టీలకు సంబంధించిన 100కు పైగా పార్లమెంటు సభ్యులను కలిసి వారి మద్దతు తీసుకున్నట్లు తెలిపారు. ఈ ప్రయాణంలో అనేకమంది సామాజిక ఉద్యమకారులను కలిసినట్లు వివరించారు. మహిళా హక్కుల కోసం నిరంతరం తను గళం విప్పుతూనే ఉంటానని, చేనేత, మహిళా ఉద్యమాలను జాతీయస్థాయిలో నిర్మించే క్రమంలో ఉన్నామని చెప్పారు. తన వైపు నుంచి ఏదైనా అప్డేట్ ఉంటే నేనే స్వయంగా తెలియజేస్తానని స్పష్టం చేశారు.