బర్రెలక్కపై దాడి చేయడం కరెక్ట్ కాదు

by GSrikanth |
బర్రెలక్కపై దాడి చేయడం కరెక్ట్ కాదు
X

దిశ, తెలంగాణ బ్యూరో: కొల్లపూర్ నియోజకవర్గ స్వతంత్ర అభ్యర్థి, దళిత నిరుద్యోగ యువతి బర్రెలక్క(శిరీష)పై భౌతిక దాడులు చేయడం కరెక్ట్ కాదని.. ఈ దాడి ఖండిస్తున్నామని దళిత హక్కుల పోరాట సమితి (డీహెచ్‌పీఎస్) తీవ్రంగా ఖండించింది. ఈ మేరకు గురువారం సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మారుపాక అనిల్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ.. ప్రజాస్వామ్య దేశంలో వయోజనురాలైన నిరుద్యోగ దళిత యువతులకు ఎన్నికల్లో పోటీ హక్కు ఉందని అన్నారు.

శిరీష కుటుంబ సభ్యులపై భౌతిక దాడులు చేసి.. దళిత యువతిని పోటీలో లేకుండా చేయాలని ప్రయత్నించడం శోచనీయమన్నారు. నిరుద్యోగ యువతీకి ప్రజల్లో వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేక భౌతిక దాడులు చేస్తున్నారని విమర్శించారు. దాడులకు పాల్పడిన దుండగులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. పోలీసు ఉన్నతాధికారులు తక్షణమే చట్టపరమైన చర్యలు తీసుకోవలన్నారు. ప్రజలు ప్రజాస్వామిక వాదులు తీవ్రంగా ఖండించాలని కోరారు.

Advertisement

Next Story

Most Viewed