- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఈసీ బదిలీ చేసిన ఒక్కో పోస్టుకు ముగ్గురు
by GSrikanth |
X
దిశ, డైనమిక్ బ్యూరో: రాష్ట్రంలో ఎన్నికల వ్యవహారాల పర్యవేక్షణ నుంచి 20 మంది అధికారులను తప్పిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఈసీ నిర్ణయంతో ఖాళీ అయిన ఈ పోస్టులను భర్తీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఒక్కో పోస్టుకు ముగ్గురి పేర్లతో కూడిన ప్యానల్ ను గురువారం సీఎస్ శాంతి కుమారి ఈసీకి పంపించారు. సీనియార్టీ ప్రాతిపదికన అధికారుల పేర్లును ఈసీఐ, సీఈవోకి జాబితాను పంపించారు.
ఈ ప్యానెల్ నుంచి ఒక్కొక్కరిని కేంద్ర ఎన్నికల సంఘం ఎంపిక చేయనుంది. నలుగురు కలెక్టర్లు, ముగ్గురు పోలీసు కమిషనర్లు, పది మంది ఎస్పీలతో పాటు రవాణా శాఖ కార్యదర్శి, వాణిజ్య పన్నుల కమిషనర్, అబ్కారీ డైరెక్టర్‌లను బాధ్యతల నుంచి తప్పిస్తూ ఎలక్షన్ కమిషన్ నిర్ణయం తీసుకుంది. ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే వరకు వారికి ఎలాంటి బాధ్యతలు అప్పగించొద్దని స్పష్టం చేసింది.
Advertisement
Next Story