- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వాటిపైనే కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థుల నమ్మకం
దిశ, డైనమిక్ బ్యూరో: రాబోయే ఎన్నికల్లో భారీ మెజార్టీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనే లక్ష్యంతో ఉన్న టీ.కాంగ్రెస్ ప్రచారానికి పదును పెట్టారు. ఇప్పటికే కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలు రాష్ట్రానికి వచ్చి మొదటి విడత విజయభేరి బస్సు యాత్ర నిర్వహించగా క్షేత్రస్థాయిలో అభ్యర్థులు సైతం తమ ప్రచారాన్ని ముందుకు తీసుకువెళ్తున్నారు. పార్టీ అనౌన్స్ చేసిన ఆరు గ్యారెంటీ స్కీమ్‌లతో ప్రజల్లోకి దూసుకుపోతున్నారు. మహాలక్ష్మి, రైతు భరోసా, గృహ జ్యోతి, ఇందిరమ్మ ఇండ్లు, యువ వికాసం, చేయూత పథకాలను ప్రజలకు చేరువ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. తాము అధికారంలోకి వస్తే ఈ ఆరు గ్యారెంటీలను తప్పకుండా నెరవేరుస్తామని, తమపై నమ్మకం ఉంచాలని ప్రజలకు వివరిస్తున్నారు.
కాంగ్రెస్ అధికారంలో ఉన్న మిగతా రాష్ట్రాల్లో తాము చెప్పిన హామీలను నెరవేరుస్తున్నామని తెలంగాణలోనూ అమలు చేస్తామని హామీ ఇస్తున్నారు. అయితే అభ్యర్థులంతా ఒకే తరహాలో ప్రచారం నిర్వహించడం ఆసక్తిగా మారింది. ఆరు గ్యారెంటీ స్కీమ్‌లతో కూడిన సోషల్ మీడియా పోస్టులు ఇంటర్నెట్‌లో హల్ చల్ చేస్తున్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పలువురు అభ్యర్థులు ఒకే తరహా ఫొటోలతో ప్రచారం చేయడం ఇంట్రెస్టింగ్‌గా మారింది. ఇలాంటి ప్రచారం ద్వారా అభ్యర్థుల కంటే పార్టీ పేరు ప్రజల్లో మారుమోగుతోందని చెబుతున్నారు.