- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
‘ఇలా ప్రపంచంలో ఎక్కడా జరగలేదు.. కేసీఆర్ కుటుంబానిది గిన్నీస్ రికార్డు’
దిశ, తెలంగాణ బ్యూరో: టీఎస్‌పీఎస్సీని ప్రక్షాళన చేస్తామని మంత్రి కేటీఆర్ ఇప్పుడు అంటున్నారని.. ఇన్నాళ్లు అధికారంలో ఉండి ఎందుకు ప్రక్షాళన చేయలేదని బీజేపీ స్టేట్ చీఫ్, కేంద్ర కిషన్ రెడ్డి ప్రశ్నించారు. నాంపల్లి బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో సోమవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. టీఎస్పీఎస్సీ కుంభకోణంపై కేటీఆర్ వ్యాఖ్యలు దొంగలు పడ్డ ఆరు నెలలకు ఇప్పుడు ఎఫ్ఐఆర్ చేసినట్టుగా ఉందని విమర్శించారు. గత మార్చిలో ఈ కుంభకోణం జరిగిందని, ఇన్నాళ్ళు మన్ను తిన్న పాములా పట్టించుకోని కేసీఆర్, గతంలో కేటీఆర్ నాకేం సంబంధముని మాట్లాడారని గుర్తుచేశారు. సాకులతో ఉద్యోగ నియామకాలు చేయకుండా కాలయాపన చేశారని, నియామకాలు చేసిన అవినీతికి తెరలేపి నిరుద్యోగులకు యమపాశంగా మారారని విమర్శించారు. ప్రవళిక ఆత్మహత్య పాపం కేసీఆర్ ప్రభుత్వానిదేనని ఆవేదన వ్యక్తం చేశారు.
కేసీఆర్ అసమర్థత వల్ల 17సార్లు పరీక్షలు వాయిదా పడ్డాయని, ఇలా ప్రపంచంలో ఇంకెక్కడా జరిగి ఉండదని అభిప్రాయపడ్డారు. ఈ గిన్నీస్ రికార్డు కేసీఆర్ కుటుంబానికే దక్కిందన్నారు. దేశంలో అత్యధిక నిరుద్యోగ రేట్ తెలంగాణలోనే ఉందన్నారు. పదేళ్లలో ఒక్క గ్రూప్-1, టీచర్ పోస్ట్ భర్తీ చేయని రికార్డ్ అవార్డ్ కేసీఆర్‌కే దక్కుతుందని ఎద్దేవా చేశారు. 1 లక్ష 92 వేల ఉద్యోగ ఖాళీలు సీపీ బిశ్వాస్ కమిటీ వెల్లడించిందని, 2022 నాటికి వాటి సంఖ్య 2 లక్షలకు చేరిందని, ఈ కమిటీ నివేదికను సైతం దాచారని ఆరోపించారు. 24 వేల టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని కమిటీ పేర్కొన్నట్లు గుర్తుచేశారు. తెలంగాణలో కల హీనంగా యూనివర్సిటీస్ తయారు అయ్యాయని, ఈ ప్రభుత్వ నిర్లక్ష్యంతో చాలా డిపార్ట్మెంట్‌లు మూతపడ్డాయని తెలిపారు. ప్రస్తుతం యూనివర్సిటీలో ఉన్న పరిస్థితిపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. బీజేపీ అధికారంలోకి రాగనే టీఎస్పీఎస్సీని ప్రక్షాళన చేసి.. ఉద్యోగాలను భర్తీ చేస్తాం, కేంద్రం మాదిరిగా ఉద్యోగ నియామకాలు చేపడతామని హామీ ఇచ్చారు.
జనసేన పొత్తుపై స్పందించిన కిషన్ రెడ్డి
ఢిల్లీలో నవంబర్ 1న సీఈసీ మీటింగ్ ఉంటుందని, అందులో సెకండ్ లిస్ట్‌పై చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. తెలంగాణలో జనసేనతో పొత్తుపై ఇంకా చర్చలు నడుస్తున్నాయని, అధిష్టానం నిర్ణయం మేరకు ముందుకు వెళ్తామన్నారు. అన్ని జిల్లాల్లో మీటింగ్స్ పెట్టాకే అభ్యర్థుల ఎంపిక చేస్తున్నామని తెలిపారు. అభ్యర్థులను ప్రకటించిన తర్వాత కుడా అసమ్మతి నేతలతో మాట్లాడుతున్నామని చెప్పారు. తొందరలోనే ఎన్నికల మేనిఫెస్టో ప్రకటిస్తామన్నారు. బీఆర్ఎస్ అభ్యర్థిపై జరిగిన దాడి విషయం తనకు తెలియదని అన్నారు. కానీ ప్రజాస్వామ్యంలో ఇలాంటి దాడులు చేయడం సరికాదని కిషన్ రెడ్డి అన్నారు.