- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అక్బరుద్దీన్ సభలో పోలీసుల తప్పేం లేదు: డీసీపీ
దిశ, వెబ్‌డెస్క్: పోలీసులపై ఎమ్ఐఎమ్ ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ చేసిన కామెంట్స్ రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారాయి. పోలీసులకు వార్నింగ్ ఇచ్చిన మాటలు సోషల్ మీడియాలో తీవ్ర దుమారాన్నే రేపాయి. ఈ కామెంట్స్ విషయంలో ఇప్పటికే అక్బరుద్దీన్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. తాజాగా.. ఈ ఇన్సిడెంట్‌పై సౌత్ ఈస్ట్ జోస్ డీసీపీ రోహిత్ రాజు స్పందించారు. ఘటనపై సంపూర్ణ విచారణ జరిపినట్లు తెలిపారు.
అక్బరుద్దీన్ ఎన్నికల ప్రచార సమయంలో పోలీసులు దురుసుగా ప్రవర్తించలేదని తేలిందని వెల్లడించారు. అక్బరుద్దీన్ ప్రభుత్వ అధికారుల విధులకు ఆటంకం కలిగించారని అన్నారు. అంతేకాదు.. విద్వేశాలు రెచ్చగొట్టేలా ప్రసంగం చేశారని తెలిపారు. కాగా, మజ్లిస్ పార్టీ నేత, చాంద్రాయణగుట్ట ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ ఈ నెల 21న సంతోష్‌నగర్‌లో జరిగిన బహిరంగ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక సీఐ సభా వేదిక పైకి ఎక్కినట్లు ఎలాంటి ఆధారాలు లేవని డీసీపీ స్పష్టం చేశారు.