HYD: గాంధీ భవన్‌ వద్ద వ్యక్తి ఆత్మహత్యాయత్నం

by GSrikanth |
HYD: గాంధీ భవన్‌ వద్ద వ్యక్తి ఆత్మహత్యాయత్నం
X

దిశ, డైనమిక్ బ్యూరో: హైదరాబాద్‌లోని గాంధీ భవన్‌లో ఇవాళ ఉద్రిక్తత వాతవారణం నెలకొంది. ఓ వ్యక్తి పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకునేందుకు ప్రయత్నించాడు. వెంటనే అక్కడున్న కాంగ్రెస్ కార్యకర్తలు గమనించి అతన్ని అడ్డుకున్నారు. అనంతరం మీడియాతో బాధితుడు ఆవేదన వెల్లడించారు. తన పేరు భాస్కర్ అని, మక్తల్ నియోజకవర్గం చిత్తనూరు గ్రామానికి చెందిన వ్యక్తినని వెల్లడించాడు. తన గ్రామాన్ని కాపాడాలని కాంగ్రెస్ పార్టీని కోరారు. తమ గ్రామాంలో ఇథనాల్ కంపెనీ ఏర్పాటు చేయొద్దని, ఇథనాల్ కంపెనీ ఏర్పాటు చేస్తే తమ ఊరికి నష్టం జరుగుతుందని భాస్కర్ ఆవేదన వ్యక్తం చేశాడు. ఇథనాల్ కంపెనీ ఏర్పాటు చేయకుండా పోరాటం చేయాలని భాస్కర్ కాంగ్రెస్‌ను కోరాడు.

Advertisement

Next Story

Most Viewed