- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
కేసీఆర్‌కు షర్మిల ఇస్తానన్న గిఫ్ట్ ఇదే.. ఎందుకో తెలుసా?
దిశ, తెలంగాణ బ్యూరో: 80 వేల పుస్తకాలు చదివిన అపర మేధావి అని చెప్పుకునే సీఎం కేసీఆర్ భారత రాజ్యాంగం చదవలేదని, అందుకోసమే భారత రాజ్యాంగం పుస్తకాన్ని బహుమతిగా పంపిస్తున్నట్లు వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు షర్మిల వెల్లడించారు. శుక్రవారం అంబేద్కర్ జయంతి సందర్భంగా ట్యాంక్ బండ్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం మీడియాతో ఆమె మీడియాతో మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ భారత రాజ్యాంగాన్ని చదవలేదు కాబట్టే నియంతలా పరిపాలిస్తున్నారని మండిపడ్డారు. తాను ఈ పుస్తకం చదివితే నియంత పాలన పోయి రాష్ట్రంలో కూడా అంబేద్కర్ రాసిన రాజ్యాంగం అమలవుతుందేమో చూడాలని సెటైర్లు వేశారు. ప్రపంచమంతా భారత రాజ్యాంగాన్ని ఇంతలా గౌరవించడానికి కారణం అంబేద్కర్ అని అన్నారు. దళిత ముఖ్యమంత్రి దగ్గర నుంచి దళిత బంధు వరకు సీఎం కేసీఆర్ దళితులను మోసం చేశారని విమర్శించారు. దళిత బంధు అన్నింటికంటే పెద్ద మోసం అని ఫైర్ అయ్యారు. అంబేడ్కర్ విగ్రహం పెట్టగానే దళితుల మీద, అంబేద్కర్ మీద ప్రేమ ఉన్నట్లు కాదని, నిజంగానే దళితుల మీద.. అంబేద్కర్ మీద ప్రేమ ఉంటే వాళ్లకు రావాల్సిన సంక్షేమ పథకాలు పూర్తి స్థాయిలో ఇవ్వాలన్నారు.
ఎన్నికల వేళ అంబేద్కర్ విగ్రహాన్ని పెడితే కేసీఆర్‌కు అంబేద్కర్ మీద గౌరవం ఉన్నట్లా? అని నిలదీశారు. రాజ్యాంగాన్ని మార్చాలని మాట్లాడి దేశ రాజ్యంగంతో పాటు అంబేద్కర్‌ను కూడా అవమానించారని అన్నారు. అసలు రాజ్యాంగాన్ని ఎందుకు మార్చాలి? అని ప్రశ్నించారు. తెలంగాణలో నడుస్తున్నది అంబేద్కర్ రాసిన రాజ్యాంగం కాదని, కేసీఆర్ రాసిన రాజ్యాంగం అని విమర్శించారు. ముఖ్యమంత్రిగా ఏనాడైనా దళితలను గౌరవించారా? అని దుయ్యబట్టారు. మరియమ్మ అనే దళిత మహిళను జైల్లో పెట్టి చిత్రహింసలకు గురిచేసి చంపేసిన ప్రభుత్వం కేసీఆర్ ది అని ఆరోపించారు. ఎన్నికలు రాబోతున్నాయి కాబట్టి అంబేడ్కర్ విగ్రహం కనిపిస్తుందని, ఎన్నికలే లేకపోతే ఈ విగ్రహం కూడా కట్టేవారుకాదని అన్నారు. ఒక నియంతలా పాలిస్తూ అంబేద్కర్ వారసుడిని అని చెప్పుకోవడానికి కేసీఆర్‌కి సిగ్గుండాలని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Also Read..
షర్మిల పార్టీలో చేరి గొంతు కోసుకోలేను.. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి