- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Plastic eating insects : ముప్పు తప్పినట్లేనా?.. ప్లాస్టిక్‌ను తినే కీటకాన్ని కనుగొన్న శాస్త్రవేత్తలు
దిశ, ఫీచర్స్ : ప్లాస్టిక్ వల్ల పర్యావరణానికి, మానవ ఆరోగ్యానికి ప్రమాదం పొంచి ఉంటుందన్న విషయం తెలిసిందే. ముఖ్యంగా దీనిని వినియోగించిన తర్వాత మిగతా వస్తువుల్లాగా భూమిలో కలిసిపోయి విచ్ఛిన్నం అవదు. పైగా భూమిపై పేరుకుపోతున్న ప్లాస్టిక్ వ్యర్థాలతో ప్రపంచ మానవాళికి ఏదో ఒక రూపంలో హాని జరుగుతోంది. వివిధ రోగాలకు కారణం అవుతోంది. ఇక నదులు, సముద్రాలతోపాటు ఆయా పర్యావరణ వ్యవస్థల్లో పేరుకుపోతున్న ప్లాస్టిక్ వల్ల జలచరాలు, జంతువులు, పక్షులు కూడా ప్రమాదంలో పడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఓ తాజా పరిశోధన ఆసక్తికర విషయాలను వెల్లడించింది. ప్లాస్టిక్‌ని తినగలిగే కీటకాన్ని రీసెర్చర్స్ కనుగొన్నారు.
కెన్యా లెస్సర్ మీల్ వార్మ్
బీటిల్ జాతికి చెందిన కెన్యా లెస్సర్ మీల్ వార్మ్ (Kenyan Lesser Mealworm) అనే కీటకం రీసైకిల్ చేయడం వీలు కాని పాలీస్టైరిన్ వంటి ప్లాస్టిక్‌ను కూడా తినగలుగుతుందని, వ్యర్థాలను విచ్ఛిన్నం చేస్తుందని కెన్యాలోని ఇంటర్నేషనల్ సెంటర్ ఆఫ్ ఇన్ సెక్ట్ ఫిజియాలజీ అండ్ ఎకాలజీ (ICIPE) సైంటిస్టులు కనుగొన్నారు. అయితే ఈ కీటకాలను ఎక్కువ మొత్తంలో అభివృద్ధి చేయడం ద్వారా ప్రపంచ వ్యాప్తంగా పొంచి ఉన్న ప్లాస్టిక్ ముప్పును అరికట్టవచ్చునని వారు భావిస్తున్నారు.
పాలీ స్టైరిన్‌ను తింటున్న లార్వా
అధ్యయనంలో భాగంగా శాస్త్రవేత్తలు ల్యాబ్ ఎక్స్‌పెరిమెంట్‌లో లార్వాలకు పాలీస్టైరిన్, ఊక కలిపిన మిశ్రమాన్ని అందించారు. దీనిని ఆహారంగా తీసుకున్న లార్వా జస్ట్ వన్ మంత్‌లో పాలీస్టైరిన్‌లో 11.7 శాతాన్ని తినగలిగిందని గుర్తించారు. ఇలాంటి ఆఫ్రికన్ కీటక జాతులను కనుగొనడం నిజానికి ఓ మంచి పరిణామమని సైంటిస్టులు పేర్కొంటున్నారు. ఇక ఈ లార్వాలు ప్లాస్టిక్‌ని ఎందుకు, ఎలా తినగలుగుతున్నాయని పరిశీలించినప్పుడు వాటి గట్ బ్యాక్టీరియాలోనే అలాంటి రహస్యం దాగుందని శాస్త్రవేత్తలు గుర్తించారు. క్లూవెరా, లాక్టోకాకస్, క్లెబ్సియెల్లా వంటి జాతుల బ్యాక్టీరియా పాలీస్టైరిన్‌ను సింప్లెర్ కాంపౌండ్స్‌గా డివైడ్ చేయగల ప్రత్యేక ఎంజైమ్‌లను ప్రొడ్యూస్ చేస్తుందని పరిశోధకులు గుర్తించారు. వీటిని లార్వా ప్లాస్టిక్‌ని తినగలిగే శక్తి, సామర్థ్యాలకోసం వినియోగించుకుంటుందని కనుగొన్నారు. కాబట్టి కెన్యా లెస్సర్ మీల్ వార్మ్‌లను పెద్ద మొత్తంలో రీ ప్రొడ్యూస్ చేయగలిగితే ప్లాస్టిక్ ముప్పు నుంచి పర్యావరణాన్ని కాపాడవచ్చునని పేర్కొంటున్నారు.
ప్రాణాంతకంగా ప్లాస్టిక్
ప్లాస్టిక్ వాడకం ఏదో ఒక రూపంలో కొనసాగుతూనే ఉంది. అదే సందర్భంలో పర్యావరణాన్ని కలుషితం చేయడం ద్వారా ఇది ప్రాణాంతకంగా మారుతోంది. ప్రతీ సంవత్సం దాదాపు 8 మిలియన్ మెట్రిక్ టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాలు సముద్రాల్లో కలుస్తు్నాయి. దీంతో జలచరాలకు, పర్యావరణ వ్యవస్థలకు హాని జరుగుతోంది. ఇక అవసరాల పేరుతో ప్రపంచ వ్యాప్తంగా ఏటా 380 మిలియన్ టన్నులకు మించి ప్లాస్టిక్ ప్రొడ్యూస్ చేస్తుండగా, ఇందులో అత్యధిక భాగం నాన్ - బయోడీగ్రేబుల్ ప్లాస్టిక్ ఉంటోందని నివేదికలు పేర్కొంటున్నాయి.
రీసైక్లింగ్ పరిస్థితి
పాలీస్టైరిన్‌ను వివిధ ప్యాకేజింగ్, డిస్పోజబుల్ వస్తువుల తయారీకి యూజ్ చేస్తున్నారు. అయితే ఇది భూమిలో విచ్ఛిన్నం కావడానికి వందల ఏండ్లు పడుతుంది. అధిక ఖర్చులు, సరైన టెక్నాలజీ అందుబాటులో లేని కారణంగా దీని రీసైక్లింగ్ కూడా సరిగ్గా జరగడం లేదని శాస్త్రవేత్తలు అంటున్నారు. దీంతో భూమిపై రోజు రోజుకూ ప్లాస్టిక్ వ్యర్థాల వల్ల ముప్పు పెరుగుతోంది. తాజా పరిశోధనలు భవిష్యత్తులో ప్లాస్టిక్ భూతాన్ని తరమేందుకు ఉపయోగపడతాయని సైంటిస్టులు అభిప్రాయపడుతున్నారు.