Kavach: దట్టమైన పొగమంచులోనూ ‘కవచ్’‌తో రయ్ రయ్.. రైల్వే మంత్రి ఆసక్తికర పోస్ట్

by Ramesh N |
Kavach: దట్టమైన పొగమంచులోనూ ‘కవచ్’‌తో రయ్ రయ్.. రైల్వే మంత్రి ఆసక్తికర పోస్ట్
X

దిశ, డైనమిక్ బ్యూరో: రైలు ప్రమాదాల నివారణకు ఇటీవల (Indian Railway) భారత రైల్వే మంత్రిత్వ శాఖ ఆటోమేటిక్ ట్రైన్ ప్రొటెక్షన్ (ATP) ‘కవచ్’ (Kavach) అనే రక్షణ వ్యవస్థను అందుబాటులోకి తీసుకొచ్చిన విషయం తెలిసిందే. కవచ్ అత్యంత సాంకేతికతతో కూడిన వ్యవస్థ. ప్రస్తుతం కొన్ని మార్గాల్లో దీన్ని అమలు చేస్తున్నారు. ఈ వ్యవస్థ పనితీరు పై ఇప్పటికే పలుమార్లు కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ (Union Railway Minister Ashwini Vaishnav) చెప్పుకొచ్చారు. తాజాగా ఆయన మరోసారి కవచ్ పనితీరుపై ఎక్స్ వేదికగా ఆసక్తికర వీడియో పోస్ట్ చేశారు. దట్టమైన పొగమంచులోనూ కవచ్ సాయంతో పట్టాలపై రైలు రయ్ రయ్ మంటూ దూసుకెళ్తున్న వీడియో పోస్ట్ చేశారు.

‘బయట దట్టమైన పొగమంచు. కవచ్ క్యాబ్ లోపల సిగ్నల్ చూపిస్తుంది. పైలట్ సిగ్నల్ కోసం బయట చూడాల్సిన అవసరం లేదు’ అంటూ కేంద్ర మంత్రి రాసుకొచ్చారు. ఎలాంటి పరిస్థితుల్లో నైన పైలట్‌కు సిగ్నల్ పడిందనేది కవచ్ సాయంతో క్యాబిన్‌లోని మానిటర్‌పైనే చూడవచ్చు. రైల్వే మంత్రి పోస్ట్ చేసిన ఈ వీడియో తాజాగా వైరల్‌గా మారింది. అయితే దట్టమైన పొగమంచు వల్ల రైళ్లు ఆలస్యం అవుతుంటాయి. ఇప్పుడు అలాంటి పరిస్థితుల్లో కూడా చెక్ పెట్టొచ్చని నెటిజన్లు కామెంట్స్ హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed