ప్రజల మనోభావాలు దెబ్బతీస్తే ఊరుకోను : ఎంపీ డీకే.అరుణ

by Aamani |
ప్రజల మనోభావాలు దెబ్బతీస్తే ఊరుకోను : ఎంపీ డీకే.అరుణ
X

దిశ,జడ్చర్ల : బాలానగర్ మండల పరిధిలోని మొదంపల్లి గ్రామంలో శివాలయాన్ని మహబూబ్నగర్ ఎంపీ డీకే అరుణ స్థానిక బీజేపీ నాయకులతో కలిసి సందర్శించారు.గ్రామంలోని శివాంజనేయ ఆలయంలో సోమవారం కొందరు యువకుల దుశ్చర్య మూలంగా ధ్వంసమైన శివలింగాన్ని పరిశీలించారు.తాగిన మైకంలో ఇద్దరు యువకులు శివలింగాన్ని ధ్వంసం చేసినట్లు స్థానికులు ఎంపీ కు తెలిపారు.

స్తానికులతో మాట్లాడి ఈ ఘటనకు సంబంధించిన వివరాలు అడిగి తెలుసుకున్నరు ఈ సందర్భంగా ఎంపీ డీకే అరుణ మాట్లాడుతూ.. ప్రజలు ఎంతో పవిత్రంగా భావించే ఆలయంలో శివలింగాన్ని తొలగించి చేయరాని తప్పు చేశారని తాగిన మైకంలో విగ్రహాన్ని కదిలించి వికృత చేష్టలకు పాల్పడ్డారని ఇలాంటి ఘటన జరగడం దురదృష్టకరమని అన్నారు.దీని వెనుక ఎవరున్నారు..? వారి అసలు ఉద్దేశ్యం ఏమిటో..? బయట పెట్టాలిని డిమాండ్ చేశారు.

మొదంపల్లి గ్రామంలో‌ మత మార్పిడులు జరుగుతున్నట్లు తెలిసిందని చేతబడులు, మంత్రాల నెపంతో కొందరు స్తానికులలో భ్రమలు, భయాలు సృష్టిస్తున్నారని ఆరోపించారు. శివలింగం ధ్వంసం చేసిన ఘటనపై సమగ్ర విచారణ చేపట్టాలిఇలాంటి మతవిద్వేషాకు రెచ్చగొట్టే పనులను సహించేది లేదు ప్రజల మనోభావాలు దెబ్బతీస్తే ఊరుకోనని అన్నారు.ఈ ఘటనకు పాల్పడిన వారు ఏ మతం ఏ కులం ఏ వర్గం వారు ఉన్నా సరే వారిని ఉపేక్షించకూడదని ఇలాంటి ఘటనలు జరగకుండా ఉండాలంటే పట్టుబడ్డ నిందితులను కఠినంగా శిక్షించాలని ఎంపీ డిమాండ్ చేశారు. ఎంపీ వెంట బిజెపి జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి రాపోతుల శ్రీనివాసులు స్థానిక బీజేపీ నాయకులు గ్రామస్తులు తదితరులు ఉన్నారు.

Advertisement

Next Story

Most Viewed