- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మీ ఆయుష్షును పెంచుకోవాలా? .. రెగ్యులర్‌గా ఇలా చేయండి!
దిశ, ఫీచర్స్: ప్రతి రోజూ చేసే ఈ చిన్న పని ఆయుష్షును రెట్టింపు చేస్తుంది. దీని కోసం పెద్దగా కష్టపడాల్సిన అవసరం కూడా లేదు. కానీ, ఎక్కువ సమయం ఒకే చోట కదలకుండా కూర్చుని లేదా పడుకుని ఉండడం వల్ల ఆరోగ్య సమస్యలు వస్తాయి. ఇలా చేయడం ఆరోగ్యానికి మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా 40 ఏళ్లు దాటిన వారు ఈ పని చేస్తే, మరో పదకొండేళ్లు ఆయుష్షు పెరుగుతుందని అధ్యయనంలో తేలింది. ఆరోగ్యంగా ఉండాలంటే కేవలం పోషకాలు ఉన్న ఆహారం తీసుకోవడం మాత్రమే కాదు.. చిన్న చిన్న వ్యాయామాలు కూడా చేయాలి.
వ్యాయామం అంటే ఎక్కువసేపు కష్టపడి చేసే వర్కౌట్లు అనుకోకండి. ప్రతీ రోజూ 160 నిమిషాల పాటు నడిస్తే చాలు. దీని వల్ల దీర్ఘకాలిక వ్యాధులు వచ్చే అవకాశం తగ్గిపోయి, ఆయుష్షును పెంచుతుందని బ్రిటీష్ జర్నల్ ఆఫ్ స్పోర్ట్స్ మెడిసిన్లో ప్రచురితమైన అధ్యయనం తెలిపింది. నలభై ఏళ్లు దాటిన అమెరికన్లపై చేసిన అధ్యయనంలో.. 25 శాతం మంది శారీరక శ్రమ చేయడం వల్ల 11 ఏళ్లు ఎక్కువ బతికే అవకాశం ఉన్నట్లు తెలిపింది. తక్కువ శారీరక శ్రమ చేసే వారిలో గుండె జబ్బులు, అకాల మరణం సంభవించే అవకాశం ఉందని పరిశోధకులు చెబుతున్నారు. ఆస్ట్రేలియాలోని గ్రిఫిత్ విశ్వవిద్యాలయంతో పాటుగా ప్రపంచంవ్యాప్తంగా వివిధ సంస్థలకు చెందిన పరిశోధకులు కలిసి ఈ అధ్యయనం చేశారు.
ప్రతి రోజూ నడక, శారీరక శ్రమ, చిన్న చిన్న వ్యాయమాలు చేస్తున్నవారిపై అధ్యయనం చేశారు. నడక, తేలికపాటి వ్యాయమం చేసే వాళ్ల ఆయుష్షు 11 ఏళ్లు పెరుగుతుందని తేల్చింది. వ్యాయామం చేయని వ్యక్తుల ఆయుర్దాయం తక్కువగా ఉంటుందని గుర్తించారు. వీరు ఎక్కువ శ్రమ, వ్యాయమం చేస్తే మరో పదుకొండేళ్ల జీవితాన్ని పొందుతారు. ఇది మాత్రమే కాకుండా వ్యాయంతో పాటుగా ఆహార విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రాసెస్డ్ ఫుడ్, జంక్ ఫుడ్‌కు దూరంగా ఉండాలి. ఎక్కువగా నూనె వేసి వేయించిన ఆహార పదార్థాలు తినకుండా ఉంటేనే మంచిది. రోజు వారి ఆహారంలో భాగంగా పండ్లు, తాజా కూరగాయలు తీసుకోవాలి. సీజనల్ ఫ్రూట్స్ తప్పనిసరిగా తీసుకోవడం మంచిది. రెండు గంటలు శ్రమతో పాటుగా పోషకాలు ఉన్న ఆహారం తీసుకుంటే ఆయుష్షును పెంచుకోవచ్చు.