- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Revanth Reddy: కేసీఆర్ అసెంబ్లీకి రా తేల్చుకుందాం.. వేములవాడ సభలో సీఎం ఫైర్
దిశ, వెడ్ డెస్క్: కేసీఆర్ వేములవాడ(Vemulawada) రాజన్నను కూడా మోసం చేశాడని, అసెంబ్లీకి వస్తే అన్ని లెక్కలు చూపిస్తానని సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) అన్నారు. ఇవాళ వేములవాడ పర్యటనలో ఉన్న ఆయన పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో సీఎం మాట్లాడుతూ.. దేశానికి ప్రధానిని అందించిన గడ్డ కరీంనగర్(Karimnagar) అని, పరిపాలన ఎలా ఉంటుందో దేశానికి చూపిన తెలంగాణ బిడ్డ పీవీ నరసింహరావు అని కొనియాడారు. తెలంగాణ ఇస్తామని సోనియా గాంధీ ఇక్కడి నుంచే ప్రకటన చేశారని, తెలంగాణ బిల్లును ఆమోదించడంలో కరీంనగర్ బిడ్డ జైపాల్ రెడ్డి కీలక పాత్ర పోషించారని తెలిపారు.
కరీంనగర్ నుంచి పొన్నం ప్రభాకర్(Ponnam Prabhakar) ను గెలిపిస్తే తెలంగాణ కోసం పోరాడారని, బండి సంజయ్(Bandi Sanjay)ను రెండుసార్లు ఎంపీగా గెలిపిస్తే కరీంనగర్ అభివృద్ధికి ఏమైనా చేశారా? అని ప్రశ్నించారు. అంతేగాక కరీంనగర్ జిల్లా గురించి బండి సంజయ్ పార్లమెంట్‌లో ఎప్పుడైనా మాట్లాడారా.. బీఆర్‌ఎస్, బీజేపీ నేతలు పనిచేసి ఉంటే సాగునీటి ప్రాజెక్టులు ఎందుకు పెండింగ్‌లో ఉన్నాయని నిలదీశారు. గతంలో వేములవాడ ఎమ్మెల్యేను కలవాలంటే జర్మనీకి వెళ్లాల్సి వచ్చేదని, ఇప్పుడు మీ ఎమ్మెల్యే మీకు అందుబాటులో ఉంటున్నారని తెలిపారు. రాష్ట్రాన్ని రూ.7 లక్షల కోట్ల అప్పుల ఊబిలోకి కేసీఆర్(KCR) నెట్టారని, ప్రజలనే కాదు వేముల వాడ రాజన్నను కూడా మోసం చేశారని సంచలన వ్యాఖ్యలు చేశారు.
కేసీఆర్ ను గద్దె దించాలని సిరిసిల్ల పాదయాత్ర నుంచి నెరవేర్చుకున్నానని రేవంత్ రెడ్డి చెప్పారు. రుణమాఫీని అభినందించాల్సింది పోయి విమర్శిస్తారా? అని, పదేళ్లలో మీరు చేయని పనిని మేము చేస్తుంటే నొప్పిగా ఉందా ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే అసెంబ్లీకి వస్తే రుణమాఫీ పై లెక్కలు తీసి చూపిస్తానని చెప్పారు. ఇక స్థానిక సంస్థల ఎన్నికల్లో మీ సంగతి చూస్తామని ముఖ్యమంత్రి అన్నారు. అధికారంలోకి వచ్చాక 50 వేల ఉద్యోగాలు భర్తీ చేశామని, కావాలంటే ఉద్యోగులను పిలుస్తాం.. లెక్కపెట్టుకోవాలని, 50 వేలకు ఒక్కరు తక్కువగా ఉన్న క్షమాపణలు చెబుతానని సవాల్ విసిరారు. అలాగే మిడ్ మానేరు ప్రాజెక్టుకు సంబంధించిన అన్ని సమస్యలను పూరి చేస్తామని, ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు మంత్రి ఉత్తమ్ కృషి చేస్తున్నారని తెలిపారు. ఈ నెల 30 న మంత్రి ఉత్తమ్(N.Uttam Kumar Reddy) మరో సారి ఇక్కడికి వచ్చి ప్రాజెక్టులపై సమీక్ష చేస్తారని రేవంత్ రెడ్డి అన్నారు.