- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Police: ఎన్నికల రూల్స్ ఉల్లంఘన.. యూపీలో ఏడుగురు పోలీసులను సస్పెండ్ చేసిన ఈసీ
దిశ, నేషనల్ బ్యూరో: మహారాష్ట్ర (Maharashtra), జార్ఖండ్ (Jharkhand) అసెంబ్లీ ఎన్నికలతో పాటు, 4 రాష్ట్రాల్లోని 15 అసెంబ్లీ నియోజకవర్గాలు, మహారాష్ట్రలోని నాందేడ్ లోక్‌సభ స్థానానికి బుధవారం ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. అయితే ఉత్తరప్రదేశ్‌లో బైపోల్స్ (By polls) జరుగుతున్న పలు నియోజకవర్గాల్లో ఓటింగ్ సమయంలో నిబంధనలు పాటించడం లేదని సమాజ్ వాదీ పార్టీ(sp) ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేసింది. పోలీసు అధికారులు చట్టవిరుద్ధంగా ఓటరు కార్డులు, ఆధార్ ఐడీలను తనిఖీ చేస్తున్నారని పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ (Akhilesh yadav) ఆరోపించారు. అర్హత ఉన్నప్పటికీ పలువురిని ఓటు వేయకుండా అడ్డుకుంటున్నారని తెలిపారు. ఈ మేరకు పోలీసులు బూత్ వద్దనే ఓటర్లను నిలిపివేస్తున్న ఓ వీడియోను సైతం సోషల్ మీడియాలో రిలీజ్ చేశారు. దీనిపై వెంటనే స్పందించిన ఈసీ చర్యలు చేపట్టింది. ఎన్నికల నియామవళిని ఉల్లంఘించిన పోలీసులను సస్పెండ్ చేయాలని చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్ అధికారులను ఆదేశించారు. దీంతో ఏడుగురు పోలీసు అధికారులపై ఈసీ చర్యలు చేపట్టింది. కాన్పూర్‌లో ఇద్దరు, మొరాదాబాద్‌లో 3, ముజఫర్‌నగర్‌లో ఇద్దరు పోలీసులను సస్పెండ్ చేసింది.
‘అర్హత ఉన్న ఓటరు ఓటు వేయకుండా నిరోధించకూడదు. ఓటింగ్ సమయంలో ఎలాంటి పక్షపాత వైఖరిని సహించబోము. ఫిర్యాదు అందిన వెంటనే విచారణ ఉంటుంది. ఎవరైనా దోషులుగా తేలితే కఠిన చర్యలు తీసుకుంటాం’ అని ఈసీ ఓ ప్రకటనలో తెలిపింది. ఓటు వేయకుండా నిలిపివేసిన వ్యక్తులను పోలింగ్ బూత్‌లకు వెళ్లి మళ్లీ ఓటు వేయాలని కోరింది. ఓటర్లు ఎటువంటి భయం లేకుండా ఓటేయాలని సూచించింది. కాగా, యూపీలో 9 అసెంబ్లీ స్థానాలకు బైపోల్స్ జరుగుతున్నాయి. ఇందులో భాగంగా మధ్యాహ్నం 1 వరకు 31.21శాతం ఓటింగ్ నమోదైంది. మొత్తం 90 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు.