Mohanlal and Mammootty : మల్టీ స్టారర్‌లో మరో సినిమా.. అఫీషియల్ అనౌన్స్‌మెంట్ ఇచ్చిన మేకర్స్ (పోస్ట్)

by sudharani |
Mohanlal and Mammootty : మల్టీ స్టారర్‌లో మరో సినిమా.. అఫీషియల్ అనౌన్స్‌మెంట్ ఇచ్చిన మేకర్స్ (పోస్ట్)
X

దిశ, సినిమా: ఈ మధ్య కాలంలో మల్టీ స్టారర్ (Multi Starrer) మూవీస్ ఎక్కువగా రిలీజ్ అవుతూ.. ఫ్యాన్స్‌కు ఫుల్ కిక్ ఇస్తున్నాయి. అయితే.. గతంలో ఈ ట్రెండ్ ఉండేది. తర్వాత ఇప్పుడు మళ్లీ మొదలైంది. ఇప్పటికే చాలా మంది హీరోలు ఒకే సినిమాలో నటించి ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఇప్పుడు మరో మల్టీ స్టారర్ మూవీ స్క్రీన్‌పైకీ రానుంది. మలయాళం (Malayalam) సినీ ఇండస్ట్రీలో టాప్ మోస్ట్ స్టార్స్‌గా పేరు తెచ్చుకున్న హీరోలు మోహన్ లాల్ (Mohanlal), మమ్ముట్టి (Mammootty) కలిసి ఓ సినిమా చేయబోతున్నారు. అయితే.. ఈ స్టార్స్ గతంలో ఏడు సినిమాల్లో కలిసి నటించారు. చివరగా 2008లో ‘ట్వంటీ’ అనే చిత్రంలో కలిసి యాక్ట్ చెయ్యగా.. ఇప్పుడు మళ్లీ 16 ఏళ్ల తర్వాత ఈ కాంబోలో మూవీ రాబోతుంది.

ఈ విషయంపై అఫీషియల్ అనౌన్స్‌మెంట్ (Official Announcement) ఇచ్చారు చిత్ర బృందం. అంతే కాకుండా.. తాజాగా ఈ సినిమా షూటింగ్ శ్రీలంక (Sri Lanka)లో మొదలు పెట్టారు. దీనికి సంబంధించిన ఓపెనింగ్ ఫొటోలు సోషల్ మీడియా (Social Media) వేదికగా పంచుకుంటూ.. ‘మలయాళ స్టార్ మోహన్ లాల్ అండ్ మెగాస్టార్ మమ్ముట్టి శ్రీలంకలో 150 రోజుల షూటింగ్ ప్రారంభం కానున్న నేపథ్యంలో దర్శకుడు #మహేష్ నారాయణన్‌తో కలిసి ఒక అద్భుతమైన ప్రాజెక్ట్ కోసం చేతులు కలపారు. అంతే కాదు.. ఈ భారీ బడ్జెట్ చిత్రంలో నటించనున్నారు’ అని చెప్పుకొచ్చారు. ప్రజెంట్ ఇందుకు సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్ అవుతుండగా.. మోహన్ లాల్, మమ్ముట్టి కాంబోలో మూవీ వస్తుందని తెలియంతో ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తు్న్నారు.

Advertisement

Next Story