- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
పేదవాడికి సంక్షేమ ఫలాలు అందేలా ప్రభుత్వం కృషి
దిశ, ఉట్నూర్ : రాష్ట్రంలో ప్రతి పేదవాడికి సంక్షేమ ఫలాలు అందేలా ప్రజా ప్రభుత్వం కృషి చేస్తుందని ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ అన్నారు. ఉట్నూర్ మండల కేంద్రంలోని అంబేద్కర్ కూడలి వద్ద ప్రభుత్వ ప్రజా పాలన కళాయాత్ర ప్రజారథాన్ని డీపీఆర్వో తిరుమల ఆధ్వర్యంలో నిర్వహించగా ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పేదల సంక్షేమమే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందన్నారు. ప్రజా ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం కావస్తున్న సందర్భంలో ప్రజా పాలన విజయోత్సవాలను రాష్ట్రమంతా ఘనంగా నిర్వహిస్తున్నామని తెలిపారు.
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఆరు గ్యారెంటీలను ప్రవేశపెట్టి అమలు చేస్తుందన్నారు. ఇచ్చిన మాట ప్రకారం ప్రతి హామీని నెరవేరుస్తుందన్నారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్లు, 200 యూనిట్ల ఉచిత కరెంటు, 10 లక్షల ఆరోగ్య బీమా, 2 లక్షల రుణమాఫీ చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీదన్నారు. ప్రతి ఒక్కరూ ప్రభుత్వ సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో జైనూర్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ బానోత్ జైవంత్ రావ్, జిల్లా, మండల కాంగ్రెస్ నాయకులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.