- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘సంక్రాంతికి వస్తున్నాం’ మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్.. అఫీషియల్‌గా పోస్టర్ రిలీజ్
దిశ, సినిమా: టాలీవుడ్ స్టార్ హీరో వెంకటేష్(Venkatesh) ప్రజెంట్ బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో దూసుకుపోతున్నాడు. ఈ క్రమంలోనే అనిల్ రావిపూడి(Anil Ravipudi) దర్శకత్వంలో ‘సంక్రాంతికి వస్తున్నాం’(Sankranthiki Vasthunam) అనే చిత్రం అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే. ఈ సినిమా నుంచి ఇప్పటికే వచ్చిన అప్‌డేట్స్ ఆకట్టుకున్నాయి. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్(Sri Venkateswara Creations) బ్యానర్‌పై దిల్ రాజు(Dil Raju ), శిరీష్ (Sirish) నిర్మిస్తున్న ఈ మూవీలో ఐశ్వర్య రాజేష్(Aishwarya Rajesh), మీనాక్షి చౌదరి(Meenakshi Chaudhary) హీరోయిన్లుగా నటిస్తున్నారు.
అయితే.. ప్రజెంట్ షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ మూవీ సంక్రాంతికి విడుదల కాబోతున్నట్లు గత కొద్ది కాలంగా సోషల్ మీడియాలో వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా ఈ మూవీ రిలీజ్‌పై అఫీషియల్ అనౌన్స్‌మెంట్ ఇచ్చారు మేకర్స్. ఈ మేరకు వెంకటేష్ లుక్ రిలీజ్ చేస్తూ.. ‘ఎంటర్‌టైన్‌మెంట్ లోడ్ చేయబడుతోంది. ఫన్ ఫైర్ చేయడానికి సిద్ధంగా ఉంది.. విక్టరీ వెంకీమామ, హిట్ మెషిన్ డైరెక్టర్ అనిల్ రావిపూడి బ్లాక్ బస్టర్ కాంబో ఈ సంక్రాంతికి విక్టోరియస్ హ్యాట్రిక్ కోసం సిద్ధంగా ఉంది. ‘సంక్రాంతికి వస్తున్నాం’ చిత్రం 14 జనవరి, 2025న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ కానుంది’ అంటూ చెప్పుకొచ్చారు. ప్రజెంట్ ఈ పోస్టర్ నెట్టింట వైరల్ అవుతోంది.