Jharkhand Elections: ఝార్ఖండ్‌లో ప్రశాంతంగా ముగిసిన పోలింగ్.. పోటెత్తిన ఓటర్లు

by Shiva |   ( Updated:2024-11-20 12:35:06.0  )
Jharkhand Elections: ఝార్ఖండ్‌లో ప్రశాంతంగా ముగిసిన పోలింగ్.. పోటెత్తిన ఓటర్లు
X

దిశ, వెబ్‌డెస్క్: ఝార్ఖండ్‌ (Jharkhand)లో రెండో విడత అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. సాయంత్రం 5 గంటలు ముగిసే సరికి 67.59 శాతం పోలింగ్ నమోదైందని అదనపు చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ డాక్టర్ నేహా అరోరా (Neha Arora) తెలిపారు. ఓటర్లు ఉదయం నుంచే పోలింగ్ బూత్‌లకు తరలివచ్చారు. అన్ని వర్గాల ప్రజలు భారీగా తరలివచ్చి ఓట్లు వేశారు. ఈనెల 13న జరిగిన తొలి విడతలో కూడా భారీగానే ఓటింగ్ నమోదైంది. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 81 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా.. నవంబర్ 13న తొలి విడతలో 43 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరిగింది. మిగతా 38 స్థానాలకు ఇవాళ పోలింగ్ నిర్వహించారు. ముఖ్యంగా ఇండియా కూటమి (Alliance of India)-ఎన్డీఏ (NDA) కూటమి అభ్యర్థుల మధ్యే ప్రధాన పోటీ నెలకొంది. ఇక సాయంత్రం 6:30 గంటలకు ఎగ్జిట్‌పోల్స్ విడుదల కానున్నాయి. 2019 అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే ఝార్ఖండ్‌లో పోలింగ్ శాతం 2.75కు పెరిగింది.

రెండో దశలో బీజేపీ (BJP) 32 స్థానాల్లో, దాని మిత్రపక్షం ఏజేఎస్‌యూ (AJSU) ఆరు స్థానాల్లో పోటీ చేస్తోంది. ఇండియా కూటమి (Alliance of India)కి సంబంధించి, జేఎంఎం (JMM) 20 స్థానాల్లో, కాంగ్రెస్ (Congress) 13, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (CPI) 4, ఆర్జేడీ (RJD) 2 స్థానాల నుంచి పోటీ చేస్తున్నాయి. సీఎం హేమంత్ సోరెన్ (CM Hemanth Soren) బర్హైత్ నియోజకవర్గం నుంచి, ఆయన భార్య కల్పనా సోరెన్ (Kalpana Soren) గాండే నుంచి, సోదరుడు బసంత్ సోరెన్ (Basanth Soren) దుమ్కా నుంచి పోటీ చేస్తున్నారు. ఇక బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బాబులాల్ మరాండీ (Babulal Marandi) ధన్వర్ నుంచి పోటీలో ఉన్నారు. అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడు అమర్ కుమార్ (Amar Kumar) చందన్కియారి నుంచి, జమ్తారా నుంచి శిబు సోరెన్ కోడలు సీతా సోరెన్ (Sita Soren), సిల్లి నుంచి ఆల్ జార్ఖండ్ స్టూడెంట్స్ యూనియన్ (AJSU) అధ్యక్షుడు సుధేష్ మహతో (Sudesh Mahato) బరిలో ఉన్నారు. ఈనెల 23న తుది ఫలితాలు వెలువడనున్నాయి.

Advertisement

Next Story

Most Viewed