- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Navy helicopter:విశాఖ బీచ్ రోడ్‌లో మరో ఆకర్షణ..!
దిశ ప్రతినిధి, విశాఖపట్నం: టీయూ-142 విమానం పక్కనే యూహెచ్-3 హెచ్ యుద్ధ చాపర్ విశాఖ బీచ్ రోడ్‌లో కొలువు తీరనుంది. విశాఖకు బహుమతిగా భారత నావికాదళం దీనిని అందజేసింది. త్వరలో మ్యూజియంగా సందర్శనకు సిద్ధం కానుంది. భారత నేవీ అమ్ములపొదిలో 17 ఏళ్ల పాటు సేవలందించిన యూహెచ్-3 హెచ్ హెలికాఫ్టర్ను గత జూన్ మాసంలో డీ కమిషన్ చేశారు. ఆ సమయంలో ఇన్చార్జి కలెక్టర్ గా వ్యవహరించిన ప్రస్తుత జేసీ మయూర్ అశోక్ ద్వారా జిల్లా యంత్రాంగానికి ఈ హెలికాఫ్టర్ను బహుమతిగా అందజేస్తున్నట్లు అప్పట్లోనే నేవీ అధికారి సమీర్ సక్సేనా ప్రకటించారు. ఈ నేపథ్యంలో బుధవారం సదరు యూహెచ్క-3 హెచ్ హెలీకాఫ్టర్ను పార్టులుగా విడదీసీ విశాఖ బీచ్ రోడ్డుకు తరలించారు. ఇప్పటికే అక్కడ సబ్ మెరైన్, టీయూ 142 సహా సీ హారియర్ మ్యూజియంలు కొలువుదీరాయి. నేటి యువత యుద్ధ విమానాలు, హెలికాప్టర్లు కోసం మరింత విజ్ఞానం పెంచుకునేందుకు ఇవి ఉపయోగపడుతున్నాయి. ఈ క్రమంలో జిల్లా కలెక్టర్ అనుమతితో వుడా అధికారులు ఆ హెలికాఫ్టర్ను టీయూ-142 కు సమీపంలోనే అమర్చుతున్నారు. త్వరలో ఆ హెలికాప్టర్ మ్యూజియంగా సందర్శకులను అనుమతించనున్నట్టు తెలిసింది.