- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Skin health : చలికాలంలో వాయు కాలుష్యం.. చర్మ సమస్యలను పెంచుతుందా?
దిశ, ఫీచర్స్ : ప్రపంచ వ్యాప్తంగానే కాకుండా, మన దేశంలోనూ వాయు కాలుష్యం ప్రధాన సమస్యగా మారుతోంది. శ్వాసకోశ సమస్యలతోపాటు వివికధ ఇన్‌ఫెక్షన్లు, న్యుమోనియా సహా ఇతర అనారోగ్యాలకు దారితీస్తోంది. ముఖ్యంగా చలికాలంలో స్కిన్ అలెర్జీలు, జుట్టు రాలడం వంటి ఇబ్బందులకు కూడా కారణం అవుతోందని నిపుణులు పేర్కొంటున్నారు. ఇంకా ఏయే సమస్యలు తలెత్తుతాయో చూద్దాం.
కలుషితమైన గాలిలోని విష పదార్థాలు మన చర్మం, జుట్టు ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతాయి. ముఖ్యంగా పర్టిక్యులేట్ మ్యాటర్, ఓజోన్ కాలుష్యం, నైట్రోజన్ ఆక్సైడ్, సల్ఫర్ డయాక్సైడ్, పాలీ సైక్లిక్ ఆరోమాటిక్ హైడ్రో కార్బన్లు వంటివి స్కిన్ అలెర్జీలకు కారణం అవుతాయి. హెయిర్ ఫోలికల్స్‌లోకి కాలుష్య కారకాలు చేరడంవల్ల వెంట్రుకలు చిట్లడం, రాలడం జరుగుతాయి. పొల్యూషన్ తీవ్రతను బట్టి చర్మం డీహైడ్రేషన్‌కు గురవుతుంది. దీనివల్ల శరీరం సహజసిద్ధమైన పిగ్మెంటేషన్‌ను కోల్పోతుంది. ఫలితంగా స్కిన్‌పై పగుళ్లు ఏర్పడటం, నల్లబడటం, కాంతిహీనంగా మారడం వంటివి జరుగుతాయి. జుట్టు రాలిపోయి, క్రమంగా బట్టతలగా మారవచ్చు. కాబట్టి గాలి కాలుష్యం నుంచి మీ శరీరాన్ని, జుట్టును రక్షించునేందుకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు ఆరోగ్య నిపుణులు. సబ్బులు, కెన్సర్లతో స్నానం చేయడం, స్కిన్ టైప్‌కు సరిపోయే క్రీములను మాత్రమే వాడటం, యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ కలిగిన బ్యూటీ ప్రొడక్ట్ లేదా షాంపూలు వాడటం వంటివి చేయాలి. వీటన్నింటికంటే ముఖ్యమైంది, వాయు కాలుష్యాన్ని తగ్గించడానికి మీవంతు ప్రయత్నం చేయడం కూడా ముఖ్యం అంటున్నారు నిపుణులు.
*గమనిక : పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. ‘దిశ’ ధృవీకరించలేదు. అనుమానాలు ఉంటే నిపుణులను సంప్రదించగలరు.