AP Cabinet Meeting: ముగిసిన ఏపీ కేబినెట్ భేటీ.. కీలక నిర్ణయాలు ఇవే..!

by Shiva |
AP Cabinet Meeting: ముగిసిన ఏపీ కేబినెట్ భేటీ.. కీలక నిర్ణయాలు ఇవే..!
X

దిశ, వెబ్‌డెస్క్: సీఎం చంద్రబాబు (CM Chandrababu) అధ్యక్షతన ఏపీ కేబినెట్ సమావేశం (AP Cabinet Meeting) కాసేపటి క్రితం ముగిసింది. ఈ సమావేశానికి డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ (Deputy CM Pawan Kalyan), మంత్రులు (Ministers), ప్రభుత్వ సలహాదారులు (Government Advisers) హాజరయ్యారు. ముఖ్యంగా ఈ సమావేశంలో రాష్ట్రంలో రూ.85 వేల కోట్ల పెట్టుబడులకు సంబంధించి ఎస్ఐపీబీ (SIPB) నిర్ణయాలకు కేబినెట్ తెలిపింది. నేరాలను నియంత్రించేందుకు పీడీ యాక్ట్‌ (PD Act)ను మరింత పటిష్టం చేస్తూ సవరణ బిల్లుకు కూడా ఓకే చెప్పారు. అదేవిధంగా లోకాయుక్త (Lokayuktha) చట్ట సవరణ బిల్లుకు కూడా మంత్రి వర్గం ఆమోదం తెలిపింది.

కర్నూలు (Kurnool)‌లో కేంద్రంగా హైకోర్టు (High Court) బెంచ్ ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఈగల్ యాంటీ నార్కోటిక్స్ (Eagle Anti - Narcotics) విభాగాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. అమరావతి సాంకేతిక కమిటీ ప్రతిపాదనలకు, స్పోర్ట్స్, పర్యాటక పాలసీలకు కూడా కేబినెట్ ఆమోదం తెలిపింది. ఏపీ టవర్ కార్పొరేషన్‌ (AP Tower Corporation)ను ఫైబర్ గ్రిడ్‌ (Fiber Grid)లో విలీనం చేయాలని నిర్ణయించారు. కాంట్రాక్టర్లకు మొబలైజేషన్ అడ్వాన్స్‌ల (Mobilization Advances)ను పునరుద్ధరించనున్నారు. దేవాలయ కమిటీల్లో ఇద్దరు సభ్యులకు చోటు కల్పించేలా చట్ట సవరణ బిల్లుకు మంత్రి‌వర్గం ఆమోదం తెలిపింది.

Advertisement

Next Story