- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నాకు పెళ్లయి 6 నెలలే.. రోజుకు మూడుసార్లు సెక్స్ చేస్తా.. కానీ ఇప్పుడు..
నా వయస్సు 33 సంవత్సరాలు. నాకు పెళ్ళయి 6 నెలలవుతోంది. పెళ్ళికి ముందు సెక్స్ కోరికలు తట్టుకోలేక రోజుకు కనీసం నాలుగు సార్లయినా హస్తప్రయోగం చేసుకునే వాణ్ణి. అయితే, పెళ్ళయిన తర్వాత ప్రతీ రోజు మూడుసార్లు సెక్స్‌లో పాల్గొన్నాను. వెంటనే నా భార్య గర్భం దాల్చింది. కానీ, రెండు నెలల తర్వాత అబార్షన్ అయింది. ఆ తర్వాత నుండి సెక్స్‌లో పాల్గొందామంటే 3-4 రోజులకు ఒక సారే అంగం స్తంభిస్తోంది. నాకు సెక్స్ కోరికలు బాగానే ఉన్నాయి. పెళ్ళికి ముందు హస్తప్రయోగం వల్ల ఇలా జరుగుతుందా? నా భార్య కనీసం రోజుకు ఒకసారైనా సెక్స్‌లో పాల్గొందామంటుంది. తనకు పిల్లలంటే చాలా ఇష్టం. నా సమస్య ఏంటి, ఏదైనా ట్రీట్మెంట్ ఉంటే చెప్పండి?
మీ హస్తప్రయోగం అలవాటుకీ, అంగస్తంభన సమస్యకూ, మీ భార్యకు అయిన అబార్షన్‌కు ఎలాంటి సంబంధం లేదు. గర్భసంచిలో లోపాలు, మీ ఇద్దరి రక్తంలో జన్యు సంబంధ లోపాలు, ఆహార లోపాలు, రక్తహీనత మొదలైన ఎన్నో కాణాలు గర్భస్రావానికి దారితీస్తాయి. 2-3 రోజుల విరామం తర్వాత మంచి అంగస్తంభన వస్తుందంటే మీకు సమస్య పెద్దగా లేనట్టే. మీరు ఒకసారి సెక్సాలజిస్ట్‌ను కలిసి పురుష వంధ్యత్వ పరీక్షలు చేయించుకుంటే సెక్స్ హార్మోన్ల అసమతుల్యత ఉంటే బయటపడుతుంది. అలాగే ఎల్ఎఫ్ఎ, ఈసీజీ, ఆర్బీఎస్, రీనల్ ప్రొఫైల్, లిపిడ్ ఫ్రొఫైల్, థైరాయిడ్ ఫ్రొఫైల్, స్క్రోటల్ - పెనైల్ డాప్లర్ టెస్ట్ చేయించుకోవాలి. సిగరెట్టు, ఆల్కహాల్ అలవాట్లుంటే మానెయ్యాలి. విపరీతమైన ఆందోళనకు, మానసిక ఒత్తిడికి గురికావద్దు. చికిత్స జీవితాంతం అవసరం లేదు. పై పరీక్షలతో వ్యాధి నిర్ధారణ అవుతే హార్మోన్ థెరపీ, సెక్స్ థెరపీ కలిపి చేస్తారు.
- డాక్టర్ భారతి, MS
మేరిటల్ కౌన్సెలర్
సైకోథెరపిస్ట్ & సెక్సాలజిస్ట్