- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
జైలు నుంచి శ్రీకాంత్ గౌడ్ విడుదల
దిశ, ప్రతినిధి,మహబూబ్ నగర్: మాజీమంత్రి శ్రీనివాస్ గౌడ్ సోదరుడు శ్రీకాంత్ గౌడ్ బుధవారం జైలు నుంచి విడుదల అయ్యారు. క్రిస్టియన్ పల్లి శివారులోని 523 సర్వే నెంబర్ ప్రభుత్వ భూమిలో తప్పుడు ధ్రువీకరణ పత్రాలతో ప్లాట్లు చేసి..విక్రయించారన్న ఫిర్యాదు మేరకు నలుగురిపై కేసు నమోదు అయ్యింది. ఆ నలుగురిలో ఏ-4 గా ఉన్న శ్రీకాంత్ గౌడ్ ను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్ కు తరలించిన విషయము పాఠకులకు విధితమే...ఈ నేపథ్యంలో ఎట్టకేలకు శ్రీకాంత్ గౌడ్ బెయిలు లభించడంతో.. బుధవారం విడుదల అయ్యారు. ఈ మేరకు జిల్లా పర్యటనల్లో ఉన్న మాజీ మంత్రి,ఎమ్మెల్యే హరీష్ రావు శ్రీనివాస్ గౌడ్ ఇంటికి చేరుకుని శ్రీకాంత్ గౌడ్ ను కలిసి ధైర్యం చెప్పారు. ప్రజల కోసం ప్రశ్నిస్తే ఈ ప్రభుత్వం కేసులు పెట్టిస్తోందని,ఎన్ని కేసులు పెట్టిన భయపడకుండా ప్రజల పక్షాన పోరాడాలని హరీష్ రావు సూచించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్,ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి,మాజీ మంత్రి లక్ష్మారెడ్డి,మాజీ ఎంపీ మన్నే శ్రీనివాస్ రెడ్డి,మాజీ ఎమ్మెల్యేలు ఆల వెంకటేశ్వర్ రెడ్డి,గువ్వల బాలరాజు తదితరులు ఉన్నారు.