డేటా ఎంట్రీలో పొరపాట్లు తావివ్వకూడదు

by Naveena |
డేటా ఎంట్రీలో పొరపాట్లు తావివ్వకూడదు
X

దిశ ప్రతినిధి,మహబూబ్ నగర్: సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే వివరాల డేటా ఎంట్రీలో ఎలాంటి పొరపాట్లకు తావు ఇవ్వకుండా జాగ్రత్తగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి సూచించారు. బుధవారం జిల్లా కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేపై ఈ-డిస్ట్రిక్ట్ మేనేజర్ డేటా ఎంట్రీ నిర్వాహణపై డేటా ఎంట్రీ ఆపరేటర్లకు నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. మండల లాగిన్ లకు యూజర్ ఐడి పాస్వర్డ్ లను ఈడిఎం ఇవ్వడం జరుగుతుందని,సాయంత్రం డేటా ఎంట్రీ డెమో నిర్వహించి..డేటా ఎంట్రీ చేయాలని ఆమె ఆదేశించారు. గ్రామాల్లో నిర్వహించిన సర్వే వివరాలను ఎన్యూమరేటర్లు డేటా ఎంట్రీ చేయాలని,డేటా వివరాలను గోప్యంగా ఉంచాలని ఆమె ఆదేశించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ శివేంద్ర ప్రతాప్,ఈ-డిస్ట్రిక్ట్ మేనేజర్ చంద్రశేఖర్ పాల్గొన్నారు.

పరిశ్రమలకు స్థాపనకు అనుమతులివ్వండి...

జిల్లాలో ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహిస్తూ టిజి ఐపాస్ ద్వారా పరిశ్రమల స్థాపనకు,వివిధ శాఖల నుండి మంజూరు చేయాల్సిన అనుమతులను నిబంధనల మేరకు నిర్దేశించిన గడువులోగా మంజూరు చేయాలని జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి ఆదేశించారు. కలెక్టర్ కార్యాలయంలో పరిశ్రమల శాఖ ఆధ్వర్యంలో..నిర్వహించిన జిల్లా పరిశ్రమల ప్రోత్సాహక కమిటీ సమావేశంలో ఆమె మాట్లాడారు. టిఫ్ర్రెడ్ ద్వారా షెడ్యూల్డ్ కులాల వారికి ట్రాక్టర్ అండ్ ట్రైలర్ వాహనాలు 9 మందికి,షెడ్యూల్ తెగల వారికి 8 ట్రాక్టర్ అండ్ ట్రైలర్ కు,టాటా ఏస్,మారుతి డిజైర్ వాహనాలకు పెట్టుబడి సబ్సిడీ,సర్వీస్ సెక్టార్ ఒకరికి పావలా వడ్డీకి ఇవ్వడానికి కమిటీ ఆమోదం తెలిపింది.ఈ సమావేశంలో సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed