ఐలాపూర్ గ్రామానికి కదిలిన అధికార యంత్రాంగం

by Kalyani |
ఐలాపూర్ గ్రామానికి కదిలిన అధికార యంత్రాంగం
X

దిశ,కన్నాయిగూడెం :- మండలంలోని ఐలాపురం గ్రామ పంచాయతీలోని ప్రజలు తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న సమగ్ర కుటుంబ సర్వేను ఐలాపూర్ గ్రామస్థులు బహిష్కరించడంతో, సమస్యలు అడిగి తెలుసుకునేందుకు బుధవారం రోజున ఏటూరునాగారం ఐటిడిఏ పిఓ చిత్ర మిశ్రా,మండల యంత్రాంగం ఐలాపూర్ గ్రామనికి కదిలారు. ఐలాపూర్ గ్రామా పంచాయతీలో గ్రామ పెద్దలు ఏర్పాటు చేసిన సమావేశంలో గ్రామ మాజీ సర్పంచ్ మల్లెల లక్ష్మయ్య మాట్లాడుతూ… గ్రామానికి తారు రోడ్డు, త్రీఫేస్ కరెంట్, ఆర్ ఓ ఆర్ పట్టాలు తదితర సమస్యలను పిఓ చిత్ర మిశ్రాకు తెలిపారు.అనంతరం పిఓ చిత్ర మిశ్రా మాట్లాడుతూ… రోడ్డు సమస్యలు తీర్చేందుకు అటవీ ప్రాంతం కావడంతో కేంద్ర ప్రభుత్వం అనుమతులు రాగానే రోడ్డు సౌకర్యం ఏర్పాటు చేస్తామని గ్రామస్తులకు తెలిపారు. అనంతరం గ్రామంలో అధికారులు సర్వే నిర్వహించారు.

సమ్మక్క సారక్క దర్శనం

గ్రామం లోని సమ్మక్క సారక్క దేవాలయానికి వెళ్లి పి ఓ చిత్రా మిశ్రా దర్శనం చేసుకున్నారు. ఆలయ పూజారులు మాట్లాడుతూ… ఆలయ అభివృద్ధికి, జాతర సమయంలో భక్తులకు అవసరమైన సదుపాయాలు ఏర్పాటు చేయాలని పిఓ చిత్రా మిశ్రాని కోరడం జరిగింది. ఈ కార్యక్రమంలో పీసా కోఆర్డినేటర్ కొమరం ప్రభాకర్ మండల ప్రత్యేక అధికారి వెంకటనారాయణ, తహసిల్దార్ వేణుగోపాల్ ,ఎంపీడీఓ వనిత, ఇరిగేషన్ ఏఈ శరత్, సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్,సబ్ ఇన్స్పెక్టర్ వెంకటేష్, ఈ ఈ వీరభద్రం, ఆర్ అండ్ బి రఘువీర్, ఫారెస్ట్ రేంజ్ అధికారి నార్త్ అబ్దుల్ రహీం,గ్రామ పెద్దలు ఆలం నాగేష్, పీరీల భాస్కర్, కోడె, సుధాకర్, చంద్రయ్య, మల్లేష్, బాలయ్యా ,లక్ష్మినారాయణ, సదానందం, ఆదినారాయణ గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed