Baba Balak Nath Temple : బాబా బాలక్‌నాథ్ ఆలయ ప్రసాదం‌పై సంచలన నివేదిక.. క్యాంటీన్ మూసివేత

by Hajipasha |
Baba Balak Nath Temple : బాబా బాలక్‌నాథ్ ఆలయ ప్రసాదం‌పై సంచలన నివేదిక.. క్యాంటీన్ మూసివేత
X

దిశ, నేషనల్ బ్యూరో : హిమాచల్‌ప్రదేశ్‌లోని హమీర్‌పూర్‌‌లో ఉన్న బాబా బాలక్ నాథ్ ఆలయ(Baba Balak Nath Temple) కౌంటర్లలో విక్రయించే ప్రసాదం(Prasad) తినడానికి యోగ్యమైంది కాదని తేలింది. దీంతో భక్తులకు ప్రసాదాన్ని విక్రయించే క్యాంటీన్‌ను ఆలయ నిర్వహణ కమిటీ బుధవారం మూసివేయించింది. ఇక ప్రసాదం తయారీకి సంబంధించిన పనులను ఔట్‌సోర్సింగ్‌ ప్రాతిపదికన అర్హులైన వారికి కేటాయిస్తామని వెల్లడించింది. ఇప్పటికే ఆలయంలోని ఒక క్యాంటీన్‌ను ఔట్‌సోర్స్ చేశామని తెలిపింది.

బాబా బాలక్‌నాథ్ ఆలయ ట్రస్టు ఛైర్మన్‌గా ఉన్న బర్‌స్రార్ సబ్ డివిజనల్ మెజిస్ట్రేట్ రాజేంద్ర గౌతమ్ ఈవివరాలను వెల్లడించారు. ప్రసాదం విక్రయ క్యాంటీనుకు సంబంధించిన టెండర్ల ప్రక్రియను సాధ్యమైనంత త్వరగా పూర్తి చేస్తామన్నారు. ఈ ఆలయంలో ప్రసాదంగా విక్రయించే ‘రోట్’‌ల శాంపిళ్లను రెండు నెలల క్రితం సేకరించి టెస్టింగ్ లేబొరేటరీకి పంపించారు. వాటిని పరీక్షించగా తినేందుకు యోగ్యంగా లేవని వెల్లడైంది.



Next Story

Most Viewed