- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
ఇదేం ట్విస్ట్ రా అయ్యా.. నితిన్ ‘ఎల్లమ్మ’ సినిమాలో ఇద్దరు స్టార్ హీరోయిన్లు.. నెటిజన్ల రియాక్షన్ ఇదే!

దిశ, సినిమా: కమెడియన్ వేణు యెల్దండి(Venu Yeldandi)జబర్దస్త్ షో ద్వారా ఫుల్ ఫేమ్ తెచ్చుకున్నారు. అంతేకాకుండా పలు సినిమాల్లో నటించి ప్రేక్షకులను మెప్పించారు. ఇక ‘బలగం’ (Balagam)చిత్రంతో డైరెక్టర్‌గా మారాడు. 2023లో విడుదలైన ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ మార్చి 3న థియేటర్స్‌లో విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ అయింది. అంతేకాకుండా ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో పాటు వివాదాలతో విడిపోయిన ఎన్నో కుటుంబాలను కలిపింది. వేణు యెల్దండి చేసిన మొదటి సినిమానే ఈ రేంజ్‌లో ఉండటంతో తదుపరి ప్రాజెక్ట్‌పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రస్తుతం వేణు ‘ఎల్లమ్మ’(yellamma) చిత్రంతో రాబోతున్నారు. ఇక ఇందులో నితిన్ హీరోగా నటిస్తున్నాడు. ఈ మూవీ ఎప్పుడెప్పుడు వస్తుందా అని ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు.
ఈక్రమంలోనే.. ‘ఎల్లమ్మ’ సినిమాకు సంబంధించిన పలు వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ అందరిలో క్యూరియాసిటీని పెంచుతున్నారు. నితిన్ సరసన కీర్తి సురేష్(Keerthy Suresh) నటిస్తున్నట్లు వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. తాజాగా, ఈ చిత్రంలో మరో హీరోయిన్ జాయిన్ అయినట్లు టాక్. ఈ సినిమాలో సాయి పల్లవి (Sai Pallavi) కీలక పాత్రలో నటించబోతున్నట్లు సమాచారం. ఇక ఈ విషయం గురించి సాయిపల్లవి(Sai Pallavi)తో మూవీ మేకర్స్ చర్చలు కూడా జరిపినట్లు తెలుస్తోంది. ఇందుకు ఆమె కూడా ఒప్పుకుందట.. త్వరలోనే షూటింగ్ కూడా ప్రారంభం కానున్నట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇక ఇందులో నిజమెంత ఉందో తెలియనప్పటికీ ఇందుకు సంబంధించిన పోస్టులు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక ఈ విషయం తెలుసుకున్న నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. ఈ కాంబోలో సినిమా వస్తే హిట్ అవడం ఖాయమని అంటున్నారు.