Puthin gift: సింహం, ఎలుగుబంట్లు, బాతులు: ఉత్తర కొరియాకు పుతిన్ గిఫ్ట్

by vinod kumar |   ( Updated:2024-11-20 16:00:41.0  )
Puthin gift: సింహం, ఎలుగుబంట్లు, బాతులు: ఉత్తర కొరియాకు పుతిన్ గిఫ్ట్
X

దిశ, నేషనల్ బ్యూరో: రష్యా(Russia), ఉత్తర కొరియా(North korea) దేశాల మధ్య ఇటీవల స్నేహపూర్వక సంబంధాలు నెలకొన్నాయి. అయితే ఈ స్నేహానికి గుర్తుగా రష్యా అధ్యక్షుడు పుతిన్ (puthin) నార్త్ కొరియాకు సింహం, రెండు ఎలుగుబంట్లతో సహా డజన్ల కొద్దీ జంతువులను బహుమతిగా ఇచ్చినట్టు మాస్కో అధికారులు తెలిపారు. గిఫ్ట్‌గా ఇచ్చిన వాటిలో ఒక ఆఫ్రికన్ సింహం, రెండు ఎలుగుబంట్లు, రెండు దేశీయ యాక్స్, వివిధ జాతులకు చెందిన 25 నెమళ్లు, 40 మాండరిన్ బాతులు ఉన్నట్టు వెల్లడించారు. వీటన్నింటినీ మాస్కో జూ నుంచి ప్యోంగ్యాంగ్ జూకి బదిలీ చేసినట్టు రష్యా సహజ వనరుల మంత్రిత్వ శాఖ టెలిగ్రామ్‌లో పోస్ట్ చేసింది. కార్గో బాక్సుల్లోని జంతువులను ప్రభుత్వ విమానం నుంచి నార్త్ కొరియాజూలో దించుతున్న వీడియోను షేర్ చేసింది. పుతిన్ గతంలోనూ కిమ్‌కి 24 గుర్రాలను బహుమతిగా ఇచ్చాడు, అవి కిమ్‌కి ఇష్టమైనవిగా గుర్తించబడ్డాయి. కాగా, రష్యా నార్త్ కొరియాల మధ్య ఇటీవల ద్వైపాక్షిక సంబంధాలు బలపడ్డాయి. ఉక్రెయిన్ తో చేస్తున్న యుద్ధంలో ఉత్తర కొరియా సైన్యాన్ని రష్యాకు పంపినట్టు సైతం పలు కథనాలు వెల్లడించాయి.


Read More..

Ukraine war: యుద్ధాన్ని పొడిగించేందుకే అమెరికా ప్రయత్నం.. రష్యా సంచలన ఆరోపణ !

Advertisement

Next Story