- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Airtel: భారతీ ఎయిర్‌టెల్‌తో భారీ ఒప్పందం కుదుర్చుకున నోకియా
దిశ, బిజినెస్ బ్యూరో: దేశీయంగా 4జీ, 5జీ పరికరాల కోసం ప్రముఖ టెలికాం గేర్ల తయారీ సంస్థ నోకియాతో భారతీ ఎయిర్‌టెల్ భారీ ఒప్పందం కుదుర్చుకుంది. భవిష్యత్తులో నెట్‌వర్క్ మౌలిక సదుపాయాలను పెంచేందుకు బిలియన్ డాలర్ల ఒప్పందం జరిగిందని ఎయిర్‌టెల్ బుధవారం ప్రకటనలో స్పష్టం చేసింది. దేశవ్యాప్తంగా వివిధ నగరాల్లో 4జీ, 5జీ నెట్‌వర్క్ కోసం అవసరమైన పరికరాలను నోకియా అందించనుంది. దీనికి సంబంధించి ఖచ్చితమైన విలువ, ఇతర వివరాలను కంపెనీ వెల్లడించలేదు. ఈ భాగస్వామ్యంతో 5జీ నెట్‌వర్క్‌కు అవసరమైన బేస్ స్టేషన్స్లు, ఇతర పరికరాలు నోకియా అమర్చనుంది. ప్రస్తుతం ఉన్న 4జీ నెట్‌వర్క్‌లో సైతం వివిధ బ్రాండ్ రేడియో, బేస్ బ్యాడ్ పరికరాలను అమర్చనుంది. దీనివల్ల కస్టమర్లకు మెరుగైన నెట్‌వర్క్ సదుపాయాలు, సేవలు లభిస్తాయని ఎయిర్‌టెల్ ఎండీ గోపాల్ విట్టల్ చెప్పారు. ప్రధానంగా తక్కువ కార్బన్ ఉద్గారాల ద్వారా 5జీ నెట్‌వర్క్ సామర్థ్యాన్ని మెరుగుపరిచేందుకు ఈ ఒప్పందం ఉపయోగపడుతుందని ఇరు సంస్థలు పేర్కొన్నాయి. గతంలోనూ ఇరు కంపెనీల మధ్య టెలికాం పరికరాల కోసం ఒప్పందం కుదిరిందని, 2జీ నుంచి 4జీ వరకు నెట్‌వర్క్ పరికరాల కోసం భాగస్వామ్యం చేసుకున్నట్టు ఎయిర్‌టెల్ వెల్లడించింది.