- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ఐటీ కంపెనీలో జాబుల పేరిట మోసం
దిశ, శేరిలింగంపల్లి : ఐటీ కంపెనీలలో ఉద్యోగాల కోసం ట్రైనింగ్ ఇవ్వడంతో పాటు విదేశాలలోని వివిధ కంపెనీలలో భారీ ప్యాకేజీలతో ఉద్యోగాలు ఇస్తామని ఓ వ్యక్తి మోసం చేసిన ఘటన కూకట్ పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో వెలుగులోకి వచ్చింది. కూకట్ పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని జయనగర్ లో సాఫ్ట్వేర్ ఉద్యోగాల కోసం ట్రైనింగ్ ఇవ్వడంతో పాటు విదేశాలలోని ఐటీ కంపెనీలలో భారీ ప్యాకేజీలతో జాబ్ ఇప్పిస్తామంటూ గంగరాజు అనే వ్యక్తి నిరుద్యోగులను నమ్మించాడు. ఆయనను నమ్మిన పలువురు ట్రైనింగ్ తీసుకున్నారు. అందుకోసం భారీగా డబ్బులు ముట్టచెప్పారు. ట్రైనింగ్ పూర్తి అయ్యి రెండేళ్లు గడుస్తున్నా ఉద్యోగాలు ఇప్పించకపోవడంతో బాధితులు బుధవారం గంగరాజు ఇంటి ముందు ఆందోళనకు దిగారు. అప్పులు తెచ్చి మరీ తమ పిల్లలకు ట్రైనింగ్ ఇప్పిచ్చామని బాధితులు వాపోయారు. ఇంకొందరు డబ్బులు లేక ట్రైనింగ్ కోసం పర్సనల్ లోన్ యాప్స్ లోన్ తీసుకొని మరీ డబ్బులు చెల్లించిన బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. డబ్బులు కట్టాలని లోన్ యాప్స్ వేధింపులు ఎక్కువ కావడంతో బాధితుడు ఆత్మహత్యకు యత్నించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. గంగరాజు పై ఇప్పటికే పోలీస్ స్టేషన్ లో సైతం కేసు నమోదు చేసినట్లు చెబుతున్నారు. గంగరాజు పై చర్యలు తీసుకోవాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు.