పెన్షన్ పెంచకపోతే ఇక పోరాటమే

by Naveena |
పెన్షన్ పెంచకపోతే ఇక పోరాటమే
X

దిశ ,సూర్యాపేట కలెక్టరేట్ : వికలాంగుల హక్కుల పోరాట సమితి (VHPS) ఆధ్వర్యంలో బుధవారం సూర్యాపేట జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ముందు ఆందోళన చేశారు. వికలాంగుల హక్కుల పోరాట సమితి జాతీయ కోర్ కమిటీ కో కన్వీనర్ అందే రాంబాబు మూడవ రోజు నిరాహార దీక్షను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెన్షన్ పెంచకుంటే ఇక పోరాటమేనని, వికలాంగులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని ఆయన అన్నారు. వికలాంగులకు చట్టసభలలో రాజకీయ రిజర్వేషన్ 5శాతం అమలు చేయాలని ఆయన కోరారు. మూడవ రోజు దీక్షలో హుజూర్ నగర్ నియోజకవర్గం నుంచి 80 మంది వికలాంగులు దీక్షలో కూర్చున్నారు. ఈ దీక్షలో కూర్చున్న వారికి మహాజన సోషలిస్ట్ పార్టీ రాష్ట్ర నాయకులు ఎర్ర వీరస్వామి మాదిగ, ఎమ్మార్పీస్ జిల్లా ప్రచార కార్యదర్శి ములుగురి రాజు నిమ్మరసం ఇచ్చి..దీక్షను విరమింప చేశారు. ఈ కార్యక్రమంలో వికలాంగుల హక్కుల పోరాట సమితి జిల్లా అధికార ప్రతినిధి పేరెల్లి బాబు, జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం డి జహీర్ బాబా,జిల్లా ఉపాధ్యక్షులు చింత సాంబయ్య, జిల్లా కార్యదర్శి మిద్దె సైదులు, నాయకులు కాలం శ్రీనివాసరావు, ఇంద్రాల పిచ్చయ్య, మన్నెం వీరాంజనేయులు, పుల్లయ్య, శ్రీను చింత జానయ్య, రూప ,తారాబి, వీర నాగిరెడ్డి, రాకేష్, రమాదేవి, రాములమ్మతదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story