- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
TPCC: రాహుల్ గాంధీని ప్రధాని చేయడమే లక్ష్యం.. టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్
దిశ, వెబ్ డెస్క్: ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ(Rahul Gandhi)ని ప్రధాన మంత్రి(Prime Minister) చేయడమే లక్ష్యంగా పని చేయాలని టీపీసీసీ అధ్యక్షులు(TPCC President) మహేష్ కుమార్ గౌడ్(Mahesh Kumar Goud) అన్నారు. గాంధీ భవన్(Gandhi Bhavan) అఖిల భారత కాంగ్రెస్(Indian National Congress) సేవాదల్(Sevadal) 100 సంవత్సరాల ఉత్సవాలు ఘనంగా జరుపుతున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మహేష్ గౌడ్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీలో అనుబంధ సంఘాలకు అత్యంత ప్రాధాన్యత ఉంటుందని, సేవాదల్ కాంగ్రెస్ పార్టీలో చాలా ముఖ్యమైన భూమిక పోషించిందని స్పష్టం చేశారు. తెలంగాణలో అనుబంధ సంఘాల చైర్మన్ లకు అందరికి ఆయా కార్పొరేషన్ చైర్మన్(Corporation Chairman) ల పదవులు ఇచ్చి గౌరవించామని, సేవాదల్ కార్యకర్తలకు, నాయకులకు కాంగ్రెస్ గ్రామస్థాయి, మండల స్థాయి కార్యకర్తలకు ఆయా స్థాయిలలో ప్రాధాన్యత ఇస్తామని తెలిపారు.
అలాగే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కార్యకర్తల కృషి ఫలితంగా ఏర్పడిందని, మీ కష్టానికి తప్పకుండా ఫలితాలు ఉంటాయని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy), ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క(Deputy CM Bhatti Vikramarka), మంత్రులు అంతా నిత్యం ప్రజల్లో ఉండి సేవలు చేస్తున్నారని, రైతులకు 2 లక్షల రుణ మాఫీ కోసం 18 వేల కోట్ల రూపాయలు ఇచ్చారని గుర్తుచేశారు. అంతేగాక పదేళ్లలో కేసీఆర్(KCR) ప్రభుత్వం చేయలేని పనులు కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాదిలో చేసిందని, 50 వేల ఉద్యోగాలు ఇచ్చిన ఘనత కాంగ్రెస్ పాలకులదని తెలియజేశారు. ఇక మహాత్మ గాంధీ, నెహ్రులు దేశం కోసం ఎన్నో త్యాగాలు చేశారని, బీజేపీ(BJP) చరిత్రను వక్రీకరించి అబద్ధాలు ప్రచారం చేసి రాజకీయంగా కుట్రలు చేస్తోందని ఆరోపించారు. రాహుల్ గాంధీ దేశాన్ని ఐక్యంగా ఉంచేందుకు దేశంలో పాదయాత్ర చేశారని, ఆయనను ప్రధాని చేయాలన్న లక్ష్యంగా పని చేయాలని కార్యకర్తలకు సందేశం ఇచ్చారు.