కంప్యూటర్ యుగం వచ్చినా తగ్గని పుస్తకం విలువ

by Sridhar Babu |
కంప్యూటర్ యుగం వచ్చినా  తగ్గని పుస్తకం విలువ
X

దిశ, అదిలాబాద్ : కంప్యూటర్ యుగం వచ్చినా , కొత్త టెక్నాలజీ పెరిగినప్పటికీ పుస్తకం విలువ తగ్గలేదని ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. గ్రంథాలయ వారోత్సవాలలో భాగంగా బుధవారం నిర్వహించిన ముగింపు కార్యక్రమానికి ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ....ఈ గ్రంథాలయంలో ఎందరో మంది పుస్తకాలు చదివి కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలు సాధించారని తెలిపారు.

గతంలో ఏదైనా సమాచారం కావాలంటే లైబ్రరీ పైనే ఆధారపడాల్సి వచ్చేదన్నారు. గ్రంథాలయ అభివృద్ధికి తన వంతు సహాయ, సహకారాలు అందిస్తానన్నారు. మండల స్థాయిలోనే కాకుండా గ్రామస్థాయిలో సైతం గ్రంథాలయ వ్యవస్థ ఏర్పాటు కావాలని కోరారు. అంతకు ముందు గ్రంథాలయ వారోత్సవాలను పురస్కరించుకొని నిర్వహించిన వివిధ పోటీలలో గెలుపొందిన పాఠకులకు ఎమ్మెల్యే చేతుల మీదుగా బహుమతులను అందజేశారు. కార్యక్రమంలో లైబ్రరీ అధికారి శ్రీనివాస్, నాయకులు అశోక్ రెడ్డి, అంకత్ రమేశ్, ముకుంద్, ఏ.సుభాష్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story