BRS: ఆ విద్యార్థులకు మెరుగైన వైద్యం అందించాలి.. హరీష్ రావు డిమాండ్

by Ramesh Goud |
BRS: ఆ విద్యార్థులకు మెరుగైన వైద్యం అందించాలి.. హరీష్ రావు డిమాండ్
X

దిశ, వెబ్ డెస్క్: గురుకులాలా.. నరక కూపాలా..? అని, ప్రభుత్వ పాఠశాలలా.. ప్రాణాలు తీసే విషవలయాలా..? అని మాజీమంత్రి బీఆర్ఎస్ నేత హరీష్ రావు(BRS Leader Harish Rao) ప్రశ్నించారు. గురుకులాల్లో విద్యార్థుల ఫుడ్ పాయిజన్(Food Poison) ఘటనలపై స్పందించిన ఆయన.. ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఈ సందర్భంగా ఆయన.. వాంకిడి(Wankidi) గిరిజన గురుకులంలో ఫుడ్ పాయిజన్ తో అనారోగ్యం పాలై ఓ విద్యార్థిని 20 రోజులుగా నిమ్స్ ఆస్పత్రిలో వెంటిలేటర్ పై కొట్టుమిట్టాడుతున్నదని తెలిపారు.

అలాగే ఈ రోజు నల్లగొండ(Nalgonda) జిల్లాలో పాముకాటు(Snake Byte)కు గురైన విద్యార్థి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడని, ఇప్పుడు నారాయణ పేట(Narayana Peta) జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఫుడ్ పాయిజన్ తో 50 మంది విద్యార్థులు ఆసుపత్రి పాలయ్యారని వెల్లడించారు. రాష్ట్రంలోని గురుకులల్లో, ప్రభుత్వ పాఠశాలలో అసలు ఏం జరుగుతున్నదని, పాఠాలు నేర్చుకోవడం కాదు ప్రాణాలతో బయటపడితే చాలు అనే పరిస్థితిని కాంగ్రెస్ ప్రభుత్వం(Congress Govt) తీసుకొచ్చిందని ఆరోపించారు. అంతేగాక రేవంత్ రెడ్డి(CM Revanth Reddy).. ఇందుకేనా మీరు విజయోత్సవాలు జరుపుతున్నదని ఎద్దేవా చేశారు. మీ నిర్లక్ష్య పూరిత వైఖరికి ఇంకెంతమంది విద్యార్థులు బలి కావాలని నిలదీశారు. ఇక ఆస్పత్రి పాలైన విద్యార్థులను హైదరాబాదు(HYD)కు తరలించి మెరుగైన వైద్యం అందించాలని బీఆర్ఎస్(BRS) పక్షాన హరీష్ రావు డిమాండ్(Demand) చేశారు.

Advertisement

Next Story