Tirumala: శ్రీవారిని దర్శించుకున్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

by Jakkula Mamatha |   ( Updated:2024-11-20 15:42:36.0  )
Tirumala: శ్రీవారిని దర్శించుకున్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
X

దిశ, తిరుమల: టీటీడీ పాలకమండలి నిర్ణయాల పై టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడుని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కొనియాడారు. బుధవారం ఉదయం వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో ఆయన శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి ఆయనకు దర్శనం అనంతరం స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు. అనంతరం ఆలయ వెలుపల కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. తిరుమలలో రాజకీయ వ్యాఖ్యలు నిషేధిస్తూ టీటీడీ బోర్డు తీసుకున్న నిర్ణయం అభినందనీయమన్నారు. రాజకీయాలు మాట్లాడే వారిపై కేసులు పెట్టడంతో పాటు శ్రీవారి దర్శనం కల్పించకూడదన్నారు. అన్యమత ఉద్యోగులను టీటీడీ నుంచి పంపివేయాలన్న నిర్ణయం స్వాగతిస్తున్నామని, అన్యమతస్థుల వల్ల అనవసర విభేదాలు తలెత్తుతాయన్నారు. తిరుపతి స్థానికులకు నెలకొకసారి శ్రీవారి దర్శన భాగ్యం కల్పించడంపై హర్షం వ్యక్తం చేశారు. టూరిజం దర్శనం టిక్కెట్లలో గతంలో జరిగిన అవకతవకలపై విచారణ చేసి చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

Advertisement

Next Story

Most Viewed